Pawan kalyan speech at tirupati

Pawan Kalyan speech at Tirupati, Janasena party President Pawan Kalyan, assembly elections 2014, andhra elections 2014, telengana elections 2014, Lok Sabha elections 2014, General Elections 2014, elections 2014, andhra pradesh assembly elections 2014, andhra elections 2014 survey, andhra pradesh elections 2014 survey, ap assembly elections 2014

Pawan Kalyan speech at Tirupati, Janasena party President Pawan Kalyan

పవన్ కళ్యాణ్ నినాదంలో మార్పు

Posted: 05/01/2014 09:28 AM IST
Pawan kalyan speech at tirupati

బుధవారం తిరుపతిలో జరిగిన ఎన్డియే విజయ శంఖారావం సభలో మాట్లాడిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగూ సీమాంధ్రలో గల్లంతైంది కాబట్టి కాంగ్రెస్ హఠావో అనే పిలుపు ఇక నిరర్ధకమని చెప్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ హఠావో సీమాంధ్ర బచావో అనే కొత్త పిలుపునిచ్చారు.  

తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ మీద ఇంతవరకు ఎవరూ సాహసించని రీతిలో ఎదురుదాడికి దిగిన పవన్ కళ్యాణ్ తాను పార్టీ పెట్టి 50 రోజులే అయినా సీమాంధ్రులను మళ్ళీ మళ్లీ అవమానపరుస్తున్న కెసిఆర్ మీద తాను ధ్వజమెత్తినప్పుడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఎందుకు మాట్లాడటం లేదని సూటైన ప్రశ్నను సంధించారు పవన్ కళ్యాణ్.   సీమాంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడలేని జగన్ సీమాంధ్రకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదన్నారాయన.  

ఈ సందర్భంగా కెసిఆర్ నాలుకంతా విషమేమనని అన్నారు పవన్ కళ్యాణ్.  అందరినీ తిట్టే కెసిఆర్ కాబోయే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కూడా తిట్టటం సహించలేకపోయానని, విషానికి విషమే విరుగుడు కాబట్టి కెసిఆర్ విషయంలో తాను కూడా అదే పద్ధతిలో మాట్లాడానని, మోదీకి కెసిఆర్ క్షమాపణ చెప్పినట్లయితే అప్పుడు ఏం చెయ్యాలన్నది ఆలోచిస్తానని అన్నారాయన.  చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీ కలిస్తే 1, 1, 1 కలిసి 3 కాదని 111 అని మోదీ అన్న మాటలను విమర్శించిన కెసిఆర్ ని పవన్ కళ్యాణ్ దుయ్యబట్టారు.

కాంగ్రెస్, వైయస్ఆర్ కాంగ్రెస్ లు రెండూ దోచుకోవటంలో ఒకరికొకరు తీసిపోరని,  వైకాపా కి వోటేస్తే కాంగ్రెస్ కి వోటేసినట్లేనని, అఖండ ఆంధ్రప్రదేశ్ నే దోచుకున్నవారికికి తెలంగాణా లేని భూభాగాన్ని దోచుకోవటమో పెద్ద కష్టమైన పని కాదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.  

తెలంగాణాలో జరగాల్సింది పునర్నిర్మాణమైతే ఆంధ్రప్రదేశ్ లో అసలేమీ లేదు కనుక మంచి ప్రభుత్వం వచ్చినట్లయితేనే నిర్మాణం సాధ్యమని పవన్ కళ్యాణ్ అన్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles