President rule has no parliament acceptance

President rule has no parliament acceptance, Parliament ratification due for President rule, President rule in AP State completes 2 months, Two month President rule in AP state, President Pranab Mukherjee, Governor Narasimhan

President rule has no parliament acceptance

రాష్ట్రపతిపాలనకు పార్లమెంటు ఆమోదం లేదు!

Posted: 04/25/2014 11:59 AM IST
President rule has no parliament acceptance

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి రెండు నెలలు కావొస్తోంది.  కానీ రాజ్యాంగం ప్రకారం అందుకు అవసరమైన పార్లమెంటు ఆమోదం ఇంతవరకు లభించలేదు.  రాష్ట్రపతి పాలన విధించిన రెండు నెలలలో పార్లమెంటు నుంచి అందుకు తప్పని సరిగా ఆమోదం పొందవలసివుంటుంది.  కానీ ఎన్నికల మూలంగా ఆ పని జరగలేదు.  దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి కనుక పార్లమెంటు సమావేశం జరగటం లేదు.  అయితే ఈ నెల 30 కే రాష్ట్రపతి పాలన విధించి రెండు నెలలు పూర్తయిపోతున్నాయి. 
మరో పక్క రాష్ట్రపతి పాలన వలన సుప్తచేతనావస్థలో ఉన్న రాష్ట్ర శాసనసభనూ తిరిగి పునరుద్ధరించవలసివుంటుంది.  కానీ అదీ సాధ్యం కాని పని.  అందుకు కూడా ఎన్నికలే అడ్డు వస్తున్నాయి.  రాష్ట్రంలో ఎన్నికలు జరగటం, అదే సమయంలో రాష్ట్ర విభజనకు కూడా రాష్ట్రపతి ఆమోదం లభించటంతో రాజ్యాంగ పరంగాను, న్యాయపరంగానూ పెద్ద పీట ముడే పడింది. 
సుప్రీంకోర్టు ఆదేశానుసారం రాష్ట్రపతిపాలనకు పార్లమెంటులోని ఉభయ సభల నుంచి ఆమోదం పొందటం తప్పనిసరి. ఆ పని జరగనంతవరకు శాసనసభను రద్దు చెయ్యటం కూడా చెయ్యలేని పని.  అందువలన శాసనసభను సుప్త చేతనావస్థలో ఉంచటం జరిగింది.  అంటే శాసన సభ ఉంది కానీ సుప్తచేతనంలో నిద్రాణమైన స్థితిలో ఉంది.
పోనీ రాష్ట్రపతి పాలనను ఈ లోపులో రద్దు చేసి మరో సారి విధిస్తే సరిపోతుందని న్యాయనిపుణులు కొందరు భావిస్తున్నారు.  రాష్ట్రపతి పాలనను రద్దు చేస్తే దాని మీద పార్లమెంటులో ఆమోదం అవసరం పడదు.  మరోసారి రాష్ట్రపతి పాలనను విధించినట్లయితే మరో రెండు నెలలు సమయం దొరుకుతుందన్నది వారి వాదన.  కానీ ఇందుకు రాష్ట్రపతి సుముఖంగా కనిపించటంలేదు.  ఒకసారి విధించిన రాష్ట్రపతి పాలనకే కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభించలేదంటే మరోసారి అదే పని చెయ్యటం సబబు కాదన్నది ఆయన భావన.  పార్లమెంటు ఆమోదిస్తే ఆరునెలలు రాష్ట్రపతిపాలనను కొనసాగించవచ్చు, అవసరమైతే మరో ఆరునెలలు పొడిగించనూ వచ్చు. 
ఇక ఇప్పుడు ఉన్న మార్గాంతరం కేవలం రాష్ట్రపతి పాలనను మరో విధించటమే.  ఈ విషయంలో రాష్ట్రపతికి వివరించి ఆయన అంగీకారాన్ని పొందటానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది.  ఈ సందర్భంలో ఈ సమస్యనుంచి గట్టెక్కించగలిగింది కేవలం రాష్ట్రపతి మాత్రమేనని కేంద్రం భావిస్తోంది.  అందువలన పూర్తిగా బాధ్యతనంతా తన మీదనే తీసుకుని రాష్ట్రపతి వ్యవహరిస్తేనే ఈ న్యాయపరమైన చిక్కు ముడి వీడుతుంది.  
ఈ సమస్య నివారణోపాయం కోసం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తోనూ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతోనూ భేటీ అయ్యారు.  కానీ ఇంతవరకు ఏ విధమైన నిర్ణయమూ తీసుకోవటం జరగలేదు. 
-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles