Malaviya statue cleansed after modi garlanded it

Malaviya statue cleansed after Modi garlanded it, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

Malaviya statue cleansed after Modi garlanded it

మోదీ ముట్టుకున్న మాలవ్యా విగ్రహానికి సంప్రోక్షణ

Posted: 04/25/2014 02:47 PM IST
Malaviya statue cleansed after modi garlanded it

గురువారం నాడు వారణాసిలో నామినేషన్ దాఖలు చేసిన భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ దానికి ముందుగా బెనారస్ హిందు విశ్వవిద్యాలయంలో అఖండ స్వాగతాన్ని అందుకున్నారు.  అక్కడ ఆయన పండిత మదన మోహన మాలవియా విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.  మోదీ నామినేషన్ ని ప్రతిపాదించిన నలుగురిలో ఒకరు మాలవియా మనుమడు గిరిధర్ మాలవియా.  ఇంతవరకు కని విని ఎరుగని రీతిలో మోదీ నామినేషన్ కి ముందుగా అతి పెద్ద రోడ్ షో జరిగింది. 

అయితే ఇది జరిగిన కొన్ని గంటలలోనే మాలవ్యా విగ్రహానికి సంప్రోక్షణ చేసారు సమాజ్ వాదీ పార్టీ నాయకులు.  గంగానది నుంచి పవిత్ర జలాలను తెప్పించి మరీ మాలవ్యా విగ్రహానికి సంప్రోక్షణ చేసిన సమాజ్ వాదీ పార్టీ కార్పొరేటర్ రవికాంత్ విశ్వకర్మ, గుజరాత్ లో 2002 హింసాకాండలో మతోన్మాదంతో పక్షపాతిగా వ్యవహరించారని ఆరోపణనెదుర్కున్న మోదీ ఆ విగ్రహాన్ని పూలమాలలు వేసి అపవిత్రం చేసారని అందుకే ఆ విగ్రహానికి ప్రక్షాళనగావించామన్నారు. 

అంతేకాకుండా, పవిత్రమైన కాశీ క్షేత్రం నిరంకుశవాదులైన నరేంద్ర మోదీని అక్కునచేర్చుకోదని అన్నారు.  అతని సన్నిహితుడు అమిత్ షా మత విద్వేషాలను రేపి మత సామరస్యాన్ని మంటగలిపే ప్రయత్నంలో ఉన్నారని కూడా విశ్వకర్మ ఆరోపించారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles