Election campaigns in telangana

Election campaigns in Telangana, assembly elections 2014, andhra elections 2014, telengana elections 2014, Lok Sabha elections 2014, General Elections 2014, elections 2014, andhra pradesh assembly elections 2014, andhra elections 2014

Election campaigns in Telangana, Rahul Gandhi, Pawan Kalyan

చిక్కిపోతున్న సమయం, ఉధృతమౌతున్న ప్రచారాలు

Posted: 04/25/2014 09:59 AM IST
Election campaigns in telangana

తెలంగాణాలో ఎన్నికల ప్రచారానికి ఈరోజుతో కలిపి ఎన్నికల ప్రచారానికి ఇంకా ఉన్నది నాలుగు రోజుల సమయమే.  సమయం చిక్కిపోతుండటంతో రాజకీయనాయకులు ప్రచారంలో జోరు పెంచుతున్నారు.  ముఖ్య నేతల కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయి-

కెసిఆర్

తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు తెలంగాణాలో ఉధృతంగా ప్రచారం సాగిస్తున్నారు.  ఈ రోజు ఆయన ప్రచార కార్యక్రమంలో 12 చోట్ల ప్రసంగించనున్నారు.  అన్ని చోట్లకు చేరుకోవటం కోసం ఆయన హెలికాప్టర్ ని ఉపయోగిస్తున్నారు. 

కెసిఆర్ ప్రచార కార్యక్రమం ఇది-

కల్వకుర్తిలో మధ్యాహ్నం 12.00 గంటలకు, 12.40 కి నాగర్ కర్నూల్, 1.20 కి అచ్చంపేట, 2.00 గంటలకు కొల్లాపూర్, 2.40 కి శాంతి నగర్, 3.20 కి గద్వాల, 4.00 కి మక్తల్, 4.40 కి కసింకోట, 4.40 కి కోస్గి, సాయంత్రం 5.20 కి నారాయణ పేట, 6.00 కి కొత్తకోట, రాత్రి 7.00 కి జడ్చర్లలో బహిరంగ సభలలో కెసిఆర్ పాల్గొనబోతున్నారు. 

రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ మరోసారి తెలంగాణాలో పర్యటన చెయ్యబోతున్నారు.  ఈరోజు ఆయన వరంగల్ హైద్రాబాద్ లలో సభల్లో పాల్గొనబోతున్నారు.  ముందుగా మధ్యాహ్నం వరంగల్ లో ఆ తర్వాత సాయంత్రం హైద్రాబాద్ లో భారీ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించబోతున్నారు. 

హైద్రాబాద్ లో ఎల్ బి స్టేడియంలో రాహుల్ గాంధీ ప్రసంగానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.  ఈ సభను విజయవంతం చెయ్యటం కోసం ఇతర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో జన సమీకరణ జరుగుతోంది.  ఎల్ బి స్టేడియం దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు జరిగాయి. 

వరంగల్ లో జరిగే సభకు తెలంగాణా పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పర్యవేక్షణలో ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి.  ఈ సభలో రాహుల్ గాంధీ మధ్యాహ్నం 2.30 కి ప్రసంగించనున్నారు.

పవన్ కళ్యాణ్

కొత్తగా రాజకీయాలలోకి అడుగుపెట్టి జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ఎన్డియే కి మద్దతుగా ఇప్పటివరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.  ఇక సమయం దగ్గర పడుతుండటంతో ఎన్డియేకి మద్దతుగా పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీకి కూడా ప్రచారం చెయ్యనున్నారు. 
తెలంగాణా రాష్ట్రానికి తెదేపా తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికలలో నిలిచిన ఆర్ కృష్ణయ్యకి మద్దతుగా ఆయనతో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.  ఈ ప్రచార కార్యక్రమంలో భాజపా నేతలు కూడా వెంట వెళ్తున్నారు.  దేశంలో రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరగాలంటే తెదేపా, భాజపా నాయకులను గెలిపించాలంటూ పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రచారంలో ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో మధ్యాహ్నం 12.00 గంటలకు, 2.30 కి కల్వకుర్తిలోను, సాయంత్రం 4.00 కు సికింద్రాబాద్ లోను, 5.00 గంటలకు ఖైరతాబాద్, 7.00 గంటలకు శేరిలింగంపల్లిలో ప్రసంగించనున్నారు. 

చంద్రబాబు నాయుడు

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు ముందుగా కర్నూల్ జిల్లాలోను, ఆ తర్వాత హైద్రాబాద్ లలో ప్రచార సభల్లో పాల్గొంటున్నారు.  కర్నూల్ జిల్లా మంత్రాలయంలో నియోజకవర్గంలో కొసగి లోను, 11.00 గంటలకు, మధ్యాహ్నం 1.10 కి ఆలూరు లోను, సాయంత్రం 4.10 కి ఆత్మకూరులోను ప్రసంగించి ఆ తర్వాత సాయంత్రం 6.00 గంటలకు హైద్రాబాద్ చేరుకుని 6.30 రాజేంద్రనగర్ లోను, 7.45 కి జుబ్లీ హిల్స్ కృష్ణకాంత్ పార్క్ లోను సభల్లో ప్రసంగిస్తారు. 

లోకేశ్

తెలుగు దేశం పార్టీ యువనేత నారా లోకేశ్ ఈ రోజు సాయంత్రం 4.00 గంటలకు హైద్రాబాద్ లో ఇస్మత్ పుర్ లోను, 5.30 కి ఇసిఐఎల్ కూడలిలోను, 7.00 గంటలకు వనస్థలిపురంలోను ప్రసంగించనున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles