Allagadda ysrcp shobha nagi reddy is died

Allagadda YSRCP Shobha Nagi Reddy is Passed Away, YSRCP Shobha Nagi Reddy Passed Away, Shobha Nagi Reddy death, Shobha Nagi Reddy is no more

Allagadda YSRCP Shobha Nagi Reddy is Passed Away, YSRCP Shobha Nagi Reddy Passed Away, Shobha Nagi Reddy death, Shobha Nagi Reddy is no more

తిరిగిరాని లోకాలకు శోభానాగి రెడ్డి

Posted: 04/24/2014 01:02 PM IST
Allagadda ysrcp shobha nagi reddy is died

వైయస్సార్ సీపీ నాయకురాలు, కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజక అభ్యర్థి శోభానాగి రెడ్డి (45) నిన్న రాత్రి ఆళ్ళగడ్డ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే నంద్యాల ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి, మెరుగైన వైద్యం కోసం అక్కడి నుండి హైదరాబాద్ తరలించారు. కానీ ప్రమాదంలో తలకు బాగా దెబ్బలు తగలడమే కాకుండా, ప్రక్కటెముకలు కూడా విరగడంతో శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారి కోమాలోకి వెళ్లిన ఆమెకు వైద్యులు చికిత్సను అందించినా ఫలితం లేక చివరికి తుది శ్వాస విడిచింది.

నాలుగు సార్లు శాససనభకు....

ఎస్. వి. సుబ్బారెడ్డి, సుబ్బరత్నమ్మలకు చివరి సంతానంగా 1969లో జన్మించిన శోభా నాగిరెడ్డి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి, 1996లో ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టిన ఆమె ఆళ్ళగడ్డ నియోజక వర్గంలో తిరుగులేని నేతగా ఇప్పటికీ నాలుగు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. చాలా కాలం టీడీపీలో పనిచేసిన ఆమె తెలుగు దేశం హయాంలో ఆర్టీసీ ఛైర్ పర్సన్ గా భాద్యతలు నిర్వర్తించింది. తెలుగు దేశం పార్టీ నుండి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లి ఆమె ఆ తరువాత వైకాపాలోకి వెళ్ళి అక్కడి పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ, ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ వెంట నుడుస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

త్వరలో ఎన్నికలు జరగున్న వేళ ప్రచారంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం ఆ పార్టీకి, ఆ నియోజక వర్గ ప్రజలకు తీరని లోటు అని చెప్పవచ్చు. ఈమె మరణ వార్త తెలుసుకున్న వైసీపీ నేతలు, ఆమె బంధువులు పెద్ద ఎత్తున కేర్ ఆసుపత్రికి చేరుకొన్నారు. ఈమె మరణం పట్ల పలువురి నేతలు సంతాపం తెలియజేశారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles