International criminal police organization interpol

interpol, world, International Criminal Police Organization (interpol), kvp, congress party mp kvp.

International Criminal Police Organization (interpol)

ఇంటర్ పోల్ అంటే ఏమిటి? కేవిపి

Posted: 04/24/2014 01:18 PM IST
International criminal police organization interpol

ఆంధ్రరాష్ట్రం పరువు కేవిపి ద్వారా అమెరికాలో పోయింది. ఇప్పటి వరకు మన రాష్ట్రాని అమెరికా ఇంటర్ పోల్ అధికారులతో  రాలేదు. కానీ కేవిపి ద్వారా అది సాద్యమైంది.  అమెరికా కేవిపి పై ఇంటర్ పోల్ ఎందుకు ప్రయోగించింది? అసలు ఇంటర్ పోల్ అంటే ఏమిటి? 

 ఇంటర్నేషనల్  క్రిమినల్ పోలీసింగ్ ఆర్గనైజేషన్ (ఇంటర్ పోల్ ) అంటారు. ఈ ఇంటర్ పోల్ లో 187 దేశాలు  సభ్యత్వం కలిగి ఉంటాయి.  అమెరికాతో పాటు వివిధ దేశల్లోని  లా ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీల మధ్య  సమాచారం  మార్పిడికి  ఈ ఇంటర్ పోల్ సహకరిస్తుంది. 

ఒకరకంగా చెప్పలంటే.. ‘‘నేరగాళ్ల అప్పగింత ఒప్పందం ’’ అంటారు.  ఇది 1962లో జరిగింది.  అంటే  మనదేశంలోని  నేరగాళ్లను విదేశాలకు అప్పగించాలన్నా, విదేశాల్లో ఉన్న నేరగాళ్లను  మన దేశానికి రప్పించాలన్నా ఈ ఇంటర్ పోల్ తోనే జరుగుతుంది.  1997లో భారత -అమెరికాల మద్య జరిగిన నేరగాళ్ల అప్పగింత ఒప్పందలో దీన్ని పొందుపరిచారు. 

ఉగ్రవాదంతో పాటు  అంతర్జాతీయ నేర విషయాలను  ఇంటర్ పోల్  187 సభ్యదేశాలకు అంధిస్తుంది.  ఇందులో భాగంగా ఇంటర్ పోల్ లో సభ్యత్వం ఉన్న ప్రతి దేశం  అంతర్గతంగా నేషనల్  సెంట్రల్  బ్యూరోను ఏర్పాటు చేసుకొని  నేర సమాచారం అవసరమైన మరో సభ్యదేశానిిక  సహకారం అందిస్తుంటుంది.  ఈ ఎన్ సీబీ  స్థానిక పోలీసు వ్యవస్థతో  కలిసి పని చేస్తుంది. ఇతర దేశాల నోటీసులకు స్పందించడం , నిందితులను అప్పగించడంతో పాటు దర్యాప్తు సమాచారాన్ని  ఈ ఇంటర్ పోల్   మార్పిడి చేస్తుంది. 

 

ఈ ఇంటర్ పోల్  ఏడు రకాలు నోటీసులను జారీ చేస్తుంది. 

1 రెడ్ కార్నర్ నోటీస్ 

2 బ్లూ కార్నర్ నోటీస్ 

3 గ్రీన్ కార్నర్ నోటీస్ 

4 ఎల్లో కార్నర్ నోటీస్ 

5  బ్లాక్ కార్నర్ నోటీస్ 

6 ఆరెంజ్  కార్నర్ నోటీస్ 

7 పర్పుల్ కార్నర్ నోటీస్ 

ఇలా ఏడు రకాల నోటీసులను  ఇంటర్ పోల్  జారీ చేస్తుంది. 

 రెడ్ కార్నర్ నోటీస్ అంటే ఏమిటి? 

అరెస్టుకు సంబంధించిన  వ్యక్తులకు ఈ రెడ్ కార్నర్ నోటీస్  జారీ చేయటం జరుగుతుంది.  తమకు కావాల్సిన  వ్యక్తి   ఎక్కన్నాడో  తెలుసుకొని , అరెస్టు వారెంట్  ఆధారంగానో లేదంటే కోర్టు నిర్ణయం ఆధారంగానో అరెస్ట్  చేసి  అతన్ని   అడిగిన   దేశానికి అప్పగించడం ఈ నోటీసు ముఖ్య ఉద్దేశం. 

 బ్లూ కార్నర్ నోటీస్ అంటే ఏమిటి?

బ్లూకార్నర్ నోటీస్ యొక్క ముఖ్య ఉద్దేశం  నేరస్థుడు  యొక్క సమాచారాన్ని, ఆ వ్యక్తి గుర్తించి,  ఆ దేశానికి సమాచారం ఇవ్వటమే  ఈ నోటీసు ఉద్దేశం.

 గ్రీన్ కార్నర్ నోటీస్  అంటే ఏమిటి? 

ఒక వ్యక్తి   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినప్పుడు,  అలాగే ప్రజా భద్రతకు ప్రమాదం తెచ్చిపెడుతున్నప్పుడు  వారిని హెచ్చరించటానికి ఈ గ్రీన్ కార్నర్ నోటీస్  ఉపయోగపడుతుంది. 

 ఎల్లో కార్నర్ నోటీస్ 

ఈ ఎల్లో కార్నర్  నోటీస్  యొక్క ముఖ్య ఉద్దేశం ఒక వ్యక్తి  తప్పిపోయినప్పుడు, ఆ వ్యక్తిని గుర్తించుటకు ఈ ఎల్లో కార్నర్ నోటీస్  జారీ చేస్తారు. 

 బ్లాక్ కార్నర్ నోటీస్ .. ?

ఇతర దేశాల్లో గుర్తు తెలియని  మ్రుతదేహాల సమాచారాని  కోరుతూ  ఈ బ్లాక్ కార్నర్  నోటీస్  జారీ చేస్తారు.

 ఆరెంజ్  కార్నర్ నోటీస్ ?

వ్యక్తులు లేదా ఆస్తీ ప్రమాదం , భారీ ముప్పు  రాబోతున్న సమయంలో  హెచ్చరించడానికి   ఆరెంట్  కార్నర్ నోటీస్    జారీ చేస్తారు. 

 పర్పుల్ కార్నర్ నోటీస్ ?

 క్రిమినల్స్ ఉపయోగించిన  వస్తువులు, విధానాలు, పరికాలు, ఉండేందుకు  ఉపయోగించిన స్థలాలు  సమాచారాన్ని అందించే సంద్భరంలో  ఈ పర్పుల్ నోటీస్  జారీ చేయటం జరుగుతుంది.

ఇప్పుడు ఒకరకంగా చెప్పలంటే..  కేవిపి ఇంటర్ పాల్  వారు రెడ్ కార్నర్ నోటీస్  జారీ చేయటం జరిగింది.  అంటే  కేవిపి  అరెస్టు చేయటం ఖాయమే. లోకల్ పోలీసులు సహాయంతో   కేవిపి అరెస్ట్ జరుగుతుంది. 

ఆర్ఎస్  

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles