Us seeks arrest of congress mp kvp ramachandra rao

KVP, KVP Ramachandra Rao, Congress MP KVP Ramachandra Rao, congress party, United States, titanium mine, ysr, Andhra Pradesh mp, Andhra Pradesh kvp, 2014 election, ysr and kvp.

US seeks arrest of Congress MP KVP Ramachandra Rao

ఆంధ్ర ‘ఆత్మ’కు అమెరికా కష్టాలు..?

Posted: 04/24/2014 10:05 AM IST
Us seeks arrest of congress mp kvp ramachandra rao

రాజకీయ నాయకులకు, కొంత మంది దేశ ప్రజలకు కేవిపీ (కెవిపి రామచంద్రరావు) పేరు బాగా తెలుసు.  కేవిపి అనేకంటే.. వైఎస్ఆర్ ఆత్మ అంటే  తెలుగు ప్రజలకు బాగా అర్థమవుతుంది. ఎప్పుడు సైలెంట్ గా .. తెరవెనుక ఉండే కేవిపి కోసం.. అమెరిక ప్రభుత్వం మనసు పడింది.

అంటే.. కేవిపీని అమెరికా తీసుకుపోవటానికి  కొంతమంది అధికారులు  మన ప్రభుత్వ అధికారులతో  మంతనాలు జరుపుతున్నారు.  ఈ ఆత్మకు ఇప్పుడు  అమెరికా కష్టాలు వచ్చాయి. అయితే కేవిపి మాత్రం తనకేం తెలియదని.. ఎలాంటి నోటీసులు, అధికారులు తన వద్దకు రాలేదని ..తనలోని భయాన్ని మీడియా ముందు బయటపెట్టుకుంటున్నారు. 

టైటానికి కుంభకోణంలో నిందితుడుగా అభియోగాలు వస్తున్న కెవిపి రామచంద్రరావు తనకు ఎలాంటి నోటీసు రాలేదని చెబుతున్నారు. అమెరికా కోర్టులో అభియోగాలు దాఖలయ్యాయి. అయితే రామచంద్రరావు ఎమ్.పిగా ఉన్నందున ప్రత్యేకంగా ఆచూకి తెలుసుకోవలసిన అవసరం ఏముంటుందన్నది ఒక ప్రశ్నగా ఉంది. 

రొటీన్ గా ఎవరికైనా అలాగే రెడ్ కార్నర్ నోటీసు ఇస్తారా? లేక దొరకడం లేదన్న భావన ఉన్నవారికే ఇస్తారా అన్నది చూడాలి. నిజంగానే రెడ్ కార్నర్ నోటీసు వచ్చి ఉంటే అది కెవిపికి ఇబ్బందే. అయితే నోటీసు వస్తే స్పందిస్తానని రామచంద్రరావు అంటున్నారు...

ఆర్ఎస్  

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles