Balakrishna election campaign speech in vijayanagaram

balakrishna, tdp, balakrishna election campaign, telugu desam party, vijayanagaram, chandrababu naidu, election 2014, tdp win,

balakrishna election campaign speech in vijayanagaram

విజయనగరంలో బాలయ్య స్పీచ్ అదుర్స్..

Posted: 04/23/2014 03:31 PM IST
Balakrishna election campaign speech in vijayanagaram

నందమూరి బాలయ్య  ఈరోజు  విజయనగరంలో ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. బాలయ్య దూకుడు చూసిన  టిడిపి నాయకులు ఆశ్చర్యం వ్యక్తం  చేయటం జరిగింది. హిందూపురం నియోజక వర్గం నుండి తెలుగుదేశం అభ్యర్థిగా  ఎన్నికల బరిలోకి దిగిన బాలయ్య, తన గెలుపు కోసం బాగా కష్టపడుతున్నారు.  

ఈ సందర్భంగా మాట్లాడుతూ, రెండు ప్రాంతాల అభివృద్ధే టీడీపీ లక్ష్యమని చెప్పారు. చంద్రబాబు అందరినీ ఏకతాటిపై తీసుకెళ్లే నాయకుడన్నారు. తనకు పదవుల మీద వ్యామోహం లేదని, బాబే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను పోటీ చేస్తున్న హిందూపురం తమ పార్టీ కంచుకోటని, భారీ మెజార్టీతో గెలుస్తానని బాలయ్య ధీమా వ్యక్తం చేశారు. 

బాలయ్య  ఎన్నికల ప్రచారంతో  తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కొత్త ఉత్సహం  కనబడుతుంది.  నటుడుగా ఉంటాను ..కానీ నాకు రాజకీయ పదవులు  వద్దు అని బాలయ్య అన్నారు.  తెలుగు ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ  ఉందని  బాలయ్య అన్నారు.  

balakrishna-election-campaign
balakrishna-election-campaign-1
balakrishna-election-campaign-2
balakrishna-election-campaign-3
balakrishna-election-campaign-4
balakrishna-election-campaign-5

చంద్రబాబుతోనే  తెలుగు రాష్ట్రాలు అభివ్రుద్ది చెందుతాయని  ఆయన అన్నారు.  అయితే బాలయ్యకు  తారకరత్న మద్దతు  తెలిపిన విషయం తెలిసిందే.   హిందూపురం కంచుకోటలో  తన గెలుపు ఖాయమని  బాలయ్య ధీమా వ్యక్తం చేయటం జరిగింది.  

బాలయ్య ఎన్నికల ప్రచారంలో  తెలుగుయువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.  ఈరోజు మాత్రం తన మాటల్లో ఎలాంటి  తప్పులు దొర్లకుండా జాగ్రత్తపడ్డారు. అంతేకాకుండా  రెండు రాష్ట్రాలు అభివృద్ది చెందలాంటే.. చంద్రబాబు నాయుడు వల్లే సాద్యం అవుతుందని  అన్నారు.  

తెలుగు ప్రజలు కోసం, తెలుగు జాతి కోసం  తెలుగు దేశం పార్టీ పుట్టిందని బాలయ్య గుర్తు చేశారు.  ఆయన తన వ్యాక్ చాతుర్యంతో  ఎన్నికల  ప్రచారంలో  తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పుల్ జోష్ నింపుతున్నారు.  బాలయ్య జోరు చూసిన  తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల్లో విజయం కాంతులు కనిపిస్తున్నాయి. 

ఆర్ఎస్ 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles