Jp any more instead his support will be for mallareddy pawan

pawan kalyan, Lok Satta chief jp, jaya prakash narayana, Pawan Kalyan support TDP, Pawan Kalyan met Chandra Babu, jana Sena Party president,actor Pawan Kalyan, Malkajgiri ticket to Malla Reddy

JP any more instead his support will be for Mallareddy-pawan, Pawan Kalyan support TDP, Pawan Kalyan met Chandra Babu

జేపిపై ప్రేమ-అందుకే పోటీ చేయడం లేదు: పవన్

Posted: 04/23/2014 03:47 PM IST
Jp any more instead his support will be for mallareddy pawan

 జేపీపై గౌరవముంది... కానీ

టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అనంతరం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. హైదరాబాద్ మల్కాజ్ గిరి లోక్ సభ బరిలోకి దిగిన లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ అంటే తనకు అంతులేని గౌరవం ఉందని... అందుకే, ఆయనకు మద్దతు పలుకుతున్నట్టు గతంలో తాను ప్రకటించానని చెప్పారు. 

నిన్న ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలో మల్కాజ్ గిరి లోక్ సభ టీడీపీ అభ్యర్థి మల్లారెడ్డిని... సభకు హాజరైన వారికి నరేంద్ర మోడీ పరిచయం చేశారని... అందువల్ల ఎన్డీఏకు మద్దతు పలుకుతున్న తాను... పొత్తుల గౌరవాన్ని పాటిస్తూ, మల్లారెడ్డికి మద్దతు పలుకుతున్నానని చెప్పారు.

పోటీ చేయడం లేదు  

ఓట్లు చీల్చకూడదనే భావనతోనే తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పవన్ కల్యాణ్ చెప్పారు. నరేంద్ర మోడీ ప్రధాని కావాలంటే మూడు పార్టీలు కలిసి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే మోడీ ప్రధాని కావాలని ఆయన ఆకాంక్షించారు. 

సీమాంధ్రలో టీడీపీ, బీజేపీ పార్టీలు విజయం సాధిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. అందుకే జనసేన ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి మద్దతు ఇస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు.

ఆర్ఎస్ 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles