Pawan kalyan comments on sonia gandhi

pawan kalyan, janasena party, congress party, sonia gandhi, sachin, manmohan sing, pv narasimharao, telangana, narendra modi, bjp, trs party.

pawan kalyan comments on sonia gandhi, pawan kalyan hot speech at nizamabad,

సోనియా వల్ల పాడైన మన్మోహన్- సచిన్ సంపాదనకు కారణం?

Posted: 04/22/2014 06:12 PM IST
Pawan kalyan comments on sonia gandhi

జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ఈరోజు నిజామాబాద్ లో జరిగిన బీజేపి బహిరంగ సభలో  మాట్లాడుతూ.. సోనియా గాంధీ పై మండిపడ్డారు. 

ప్రధానమంత్రి పదవిలో ఉన్న మన్మోహన్ సింగ్ కు తెరవెనుక నుంచి నడిపిస్తున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వల్లే చెడ్డపేరు వచ్చిందని పవన్ విమర్శించారు. నడిచేది మన్మోహన్.. నడిపించేది సోనియా అని ఆరోపించారు. సోనియా నిర్వాకం వల్లే తెలంగాణ పోరాటంలో పలువురు యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారన్నారు. 

కానీ, ఈ విషయాన్ని అందరూ విమర్శిస్తుంటే, కాంగ్రెస్ నాయకులు మాత్రం ఖండిస్తారని పవన్ చెప్పారు. ఈ సారి ఓటేయాలని అడిగేందుకు కాంగ్రెస్ నేతలు వస్తే బీజేపీకి ఓటు వేస్తున్నామని చెప్పండని సభకు భారీగా తరలివచ్చిన బీజేపీ, టీడీపీ శ్రేణులకు సూచించారు.

సచిన్ సంపాదనకు కారణం?    

సచిన్ వందలు, వేల కోట్ల రూపాయలు సంపాదించాడంటే... దానికి కారణం దివంగత ప్రధాని పీవీ నరసింహారావే కారణమని పవన్ కల్యాణ్ తెలిపారు. దీనికి కారణం ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలే అని... దేశం ఆర్థికాభివృద్ధి చెందింది కాబట్టే సచిన్ వెంట మల్టీ నేషనల్ కంపెనీలు క్యూ కట్టాయని చెప్పారు. 

అంత గొప్ప పీవీని కూడా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా అవమానపరిచిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి అంటే రింగు రోడ్డులు నిర్మించడం కాదు... నీరు, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాల కల్పన అని చెప్పారు. ఈ సారి మన దేశానికి మాటల మనిషి కాకుండా, చేతల మనిషి నరేంద్ర మోడీ ప్రధాని అవుతున్నారని చెప్పారు. మోడీ నాయకత్వంలో దేశం మొత్తం ఎంతో పారిశ్రామిక అభివృద్ధి చెందుతుందని జోస్యం చెప్పారు.

ఆర్ఎస్ 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles