Aap asks lg of delhi to invite bjp to form govt

AAP asks LG of Delhi to invite BJP to form Govt, Aam Admi party, Aravind Kejriwal, Delhi LG Najeeb Jung

AAP asks LG of Delhi to invite BJP to form Govt

మరోసారి ఢిల్లీ మీద దృష్టి సారించిన కేజ్రీవాల్

Posted: 04/19/2014 02:55 PM IST
Aap asks lg of delhi to invite bjp to form govt

ఢిల్లీ ముఖ్యమంత్రిగా 49 రోజులు ప్రభుత్వాన్ని నడిపిన ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వాహకుడు అరవింద్ కేజ్రీవాల్ ఈ మధ్యకాలంలో 2014 సార్వత్రిక ఎన్నికల మీద దృష్టిపెట్టి ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారు.  భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ల మోదీకి పోటీగా వారణాసిలో ఎన్నికల బరిలోకి దిగారు.  అయితే మరోసారి ఆయన దృష్టి ఢిల్లీ మీదకు మళ్ళింది. 

ఢిల్లీలో అనూహ్యంగా 70 కి 28 స్థానాలను గెలిచిన కేజ్రీవాల్, 32 స్థానాలను గెలుచుకున్న భాజపా తర్వాత స్థానంలోనే ఉన్నా, కాంగ్రెస్ మద్దతుతో అధికారాన్ని చేపట్టారు.  కానీ ఆయనను జన్ లోక్ పాల్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనివ్వకపోవటంతో కేజ్రీవాల్ 49 రోజుల్లోనే ఫిబ్రవరి 14, 2014 న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసారు.  దానితో ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ అసెంబ్లీని సుప్తచేతనావస్థలో పెట్టారు. 

ఢిల్లీ మీద రాష్ట్రపతి పాలన విధించటం మీద ఆఆపా సుప్రీం కోర్టులో పిటిషన్ వెయ్యగా, సుప్రీం కోర్టు అసెంబ్లీని పునరుద్ధరించటం కానీ లేదా రద్దు చెయ్యటానికి లెఫ్టెనెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కి అధికారాలున్నాయని తెలియజేసింది.  వెనువెంటనే లెఫ్టెనెంట్ గవర్నర్ కి ఆఆపా లేఖరాస్తూ వెంటనే భాజపాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యటానికి ఆహ్వానించమని, లేదా భాజపా అంగీకరించని పక్షంలో తాజా ఎన్నికలకు వెళ్ళమని కోరింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles