Violence at mangalagiri in tdp

violence at Mangalagiri in TDP cadre, 2014 Assembly polls, AP State Assembly polls 2014, AP Telangana Assebly elections

violence at Mangalagiri in TDP

మంగళగిరిలో అభ్యర్థి నిర్బంధం

Posted: 04/19/2014 02:19 PM IST
Violence at mangalagiri in tdp

తెదేపా కార్యకర్తల ఆందోళన, దైర్జన్యాల నడుమ రెండు రోజులుగా గుంటూరు జిల్లా మంగళగిరి వార్తలలోకి ఎక్కుతోంది.

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముందుగా వ్యాపారవేత్త తులసి రామచంద్ర ప్రభుకి మంగళగిరి శాసన సభ టికెట్ ఇచ్చారు.  శుక్రవారం అందుకు వ్యతిరేకంగా పార్టీ కార్యాలయంలో గంజి చిరంజీవి వర్గీయులు ఆందోళనకు దిగటం జరిగింది. 

దానితో చంద్రబాబు గంజి చిరంజీవికి ఈ రోజు బి ఫారమ్ ఇచ్చారు.  అందుకు చిరంజీవి, పార్టీలో తన 25 సంవత్సరాల సేవా ఫలితంగానే టికెట్ లభించిందని అన్నారు, ఆయన వర్గీయులంతా ఆనందాన్ని వెలిబుచ్చారు. 

అంతలోకే మరోసారి సీన్ మారింది.  పోతినేని శ్రీనివాస్ వర్గీయులు ఈ రోజు దౌర్జన్యానికి దిగి అభ్యర్థి గంజి చిరంజీవిని గదిలో నిర్బంధించారు.  విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగారు.  ఆందోళనచేస్తున్న తెదేపా కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles