Heartbleed virus havoc on internet

Heartbleed virus havoc on internet, Heartbleed virus present for 2 years, Heartbleed virus on websites, Heartbleed can open encrypted data, unknown loss of Heartbleed virus

Heartbleed virus havoc on internet

ఇంటర్ నెట్ లో రాజ్యమేలుతున్న హార్ట్ బ్లీడ్ వైరస్

Posted: 04/10/2014 12:48 PM IST
Heartbleed virus havoc on internet

రెండు సంవత్సరాలుగా ఇంటర్ నెట్ లో రాజ్యమేలుతున్న వైరస్ హార్ట్ బ్లీడ్ ని ఇంటర్నెట్ సెక్యూరిటీ అకస్మాత్తుగా కనిపెట్టటంతో కోట్లాది పాస్ వర్డ్స్, క్రెడిట్ కార్డ్ నంబర్లు, ఇంకా వ్యక్తిగత విషయాలు రిస్క్ లో పడ్డాయి.  ఈ హార్ట్ బ్లీడ్

వైరస్ ఇంత వరకు ఎంత నష్టం కలిగించిందో అంచనా వెయ్యటం కష్టమని అంటున్నారు.  గూగుల్ లో పనిచేసే రిసెర్చర్స్, ఫిన్నిష్ సెక్యూరిటీ ఫర్మ్ కోడెనామికాన్ లో రిసెర్చ్ చేసే వాళ్ళు విడివిడిగా దీన్ని కనిపెట్టారు. 

ఎన్నో వెబ్ సెర్వర్లను నిలయంగా చేసుకున్న ఈ హార్ట్ బ్లీడ్ వైరస్ ని ఆయా వెబ్ సైట్లు పెరికివేసే వరకు వినియోగదారులు ఈ విషయంలో చెయ్యగలిగిందేమీ లేదు. 

హార్ట్ బ్లీడ్ వైరస్ వెబ్ సైట్లలో భద్రత కోసం ఎన్ క్రిప్ట్ చేసిన వివరాలను సైతం తెరిచి చదవగలుగుతుంది.  హెచ్ టిటి పి ఎస్ ప్యాడ్ లాక్ ఉన్నా దాన్ని ఛేదించుకుని, వెబ్ సైట్ యజమానికి తెలియకుండా వివరాలను సంగ్రహించగలుగుతుంతీ హార్ట్ బ్లీడ్.  పాస్ వర్డ్ మార్చినా సరే ఆయా వెబ్ సైట్లలోంచి ఈ వైరస్ ని తీసేసేంత వరకు భద్రత కొరవైవుంటుంది. 

పేరుకు తగ్గట్టుగానే హృదయంలోంచి మొత్తం పీల్చేసే ఈ వైరస్ ని వెబ్ సైట్ల్ తమంతట తాము తీసేసి వినియోగదారులకు భద్రత కలిగించవలసిందే. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles