Violence in bihar and odisha polling

violence in Bihar and Odisha polling, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

violence in Bihar and Odisha polling

బీహార్ ఒడిశా ఎన్నికలలో మావోయిస్ట్ ల దాడి

Posted: 04/10/2014 12:14 PM IST
Violence in bihar and odisha polling

బీహార్ లోని ముంగేర్ జిల్లాలో జమూయి నియోజకవర్గానికి తరలివెళ్తున్న సిఆర్పిఎఫ్ జవాన్ల మీద మావోయిస్ట్ లు కాల్పులు జరపగా ఇద్దరు జవాన్లు మరణించారు, ఏడుగురు గాయపడ్డారు.  గాయపడ్డవారిని సమీపంలోని భగల్ పూర్ హాస్పిటల్ కి తరలించారు.  మృతిచెందిన జవాన్ల దేహాలను ఖరగ్ పూర్ పోలీస్ స్టేషన్లో ఉంచారు. 

పోల్ డ్యూటీ మీద రెండు జీపుల్లో తారాపూర్ లో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలలో వెళ్తున్న 131 సిఆర్ పిఎఫ్ బెటాలియన్ మీద కాల్పులు జరిగాయని ఖరగ్ పూర్ డిఎస్పీ రంజన్ కుమార్ తెలియజేసారు.  మావోయిస్ట్ లు ముందుగా బాంబు పేల్చి సవా లాఖ్ బాబా మందిర్ దగ్గర వాళ్ళని చుట్టుముట్టారు.  ఈ ఘటన ఉదయం 5.30 కి జరిగింది. 

మరో ఘటనలో బాంకేబజార్ ప్రాంతంలో గయ పోలీసులు ఒక్కొక్కటి 30 కిలోలున్న ఆరు బాంబులను కనిపెట్టి నిర్వీర్యం చేసారు. 

మావోయిస్ట్ లు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లుగా ముందుగానే ప్రకటించారు.  ఆరు నియోజకవర్గాల్లో ఉన్న 10215 పోలింగ్ స్టేషన్లలో 3885 ప్రమాద ఘంటికలను సూచిస్తున్నాయని ఎన్నికల కమిషన్ గుర్తించింది.  మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతంలో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేందుకు 51000 రక్షక భటులను విధుల్లోకి పంపించారు.  350 మోటార్ సైకిళ్ళ మీద పాట్రోలింగ్ జరుగుతోందని ఎన్నికల కమిషన్ అధికారులు తెలియజేసారు.  ఇవి కాకుండా మూడు హెలికాప్టర్లు, పాట్నా ఎయిర్ పోర్ట్ లో ఒక ఎయిర్ ఆంబులెన్స్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. 

ఒడిశాలో మల్కాన్ గిరి జిల్లా మత్తిలి సమీపంలో మహూపొదర్ పోలింగ్ కేంద్రం మీద దాడి చేసిన మావోయిస్ట్ లు ట్రక్ కి నిప్పంటించి నాలుగు ఇవిఎమ్ లను ఎత్తుకెళ్ళారు.  ఈ ఘటనతో మహూపొదర్ లోని 4 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ నిలిచిపోయింది.  ఇది చిత్రకొండ నియోజకవర్గం క్రిందికి వస్తుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles