Azad denied permission to vote in the absence of id proof

Azad denied vote in the absense of ID, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

Azad denied permission to vote in the absence of ID proof

గులామ్ నబీ ఆజాద్ కి పోలింగ్ బూత్ లో చేదు అనుభవం

Posted: 04/10/2014 02:32 PM IST
Azad denied permission to vote in the absence of id proof

జమ్ము కాశ్మీర్ లో తన వోటు హక్కును వినియోగించుకోవటానికి వెళ్ళిన కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులామ్ నబీ ఆజాద్ కి అక్కడ చేదు అనుభవం ఎదురైంది. 

పోలింగ్ స్టేషన్లో ఆయన్ని గుర్తింపు కార్డ్ చూపించమని అడిగారు, ఆయనేమో అలాంటిదేమీ లేక నోరు వెళ్ళబెట్టాడు.  జోగీ గేట్ ప్రాంతంలో డిపిఎస్ పోలింగ్ స్టేషన్లో జరుగుతున్న 16 వ లోక్ సభ ఎన్నికలలో తన వోటు వెయ్యటానికి వెళ్ళిన ఆజాద్ ని అక్కడి ప్రిసైడింగ్ ఆఫీసర్ గుర్తింపు కార్డ్ లేకుండా వోటు వెయ్యటానికి అనుమతించటానికి నిరాకరించారు. 

చివరకు అక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకుడు వ్యక్తిగతంగా హామీ ఇవ్వటంతో సమస్య పరిష్కారమైంది.  ఆజాద్ అంతటితో వోటు వేసి బయటకు వచ్చారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles