Politicians only for power openly admitted without hesitation

Election 2014, politicians only for power openly admit, Telangana Rashtra Samiti, Praja Rajyam party, Mahajan Socialist party

politicians only for power openly admitted without hesitation

రాజకీయాలు అధికారం కోసమే- బహిరంగ ప్రకటనలు

Posted: 04/05/2014 10:12 AM IST
Politicians only for power openly admitted without hesitation

పార్టీలో గుర్తింపు, అధికారం కోసమే రాజకీయాలలో చేరటం కానీ ప్రజాసేవ కాదన్న విషయం బయటకు చెప్పకపోయినా ఈకాలంలో అందరికీ తెలుస్తూనేవుంది కానీ, దాన్ని మరీ స్పష్టంగా చెప్పటానికి కూడా సంకోచించటంలేదు మన నాయకులు.

తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ నుంచి మహాజన సోషలిస్ట్ పార్టీ లో చేరిన జన్ను జచ్చరయ్య ట్రేడ్ యూనియన్ నాయకుడిగా పేరొందినవారు.  ఆయన తెరాస ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నా, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టగానే అందులోకి వచ్చి ఎన్నికలలో వర్ధన్నపేట నుంచి ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.  వెంటనే అందులోంచి తిరిగి తెరాస లోకి వెళ్ళిపోయారు. 

కానీ, తెరాసలో ఆయనను ఎవరూ పట్టించుకోవటం లేదని, ఆయనను పక్కకు పెట్టి వేరేవాళ్ళకి పట్టం కడుతున్నారని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని, అందువలన తన రాజకీయ భవిష్యత్ దృష్ట్యా తాను ఎమ్ఎస్ పి లో చేరానని చెప్తున్నారు జచ్చరయ్య. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles