Bjp district presidents resign opposing alliance with tdp

Telangana BJP district presidents resign, TBJP opposing alliance with TDP, Telugu Desam party, Bharatiya Janata party

BJP district presidents resign opposing alliance with TDP

తెదేపాతో పొత్తుకి వ్యతిరేకిస్తున్న భాజపా జిల్లా అధ్యక్షులు

Posted: 04/05/2014 05:12 PM IST
Bjp district presidents resign opposing alliance with tdp

తెదేపాతో భాజపా పొత్తుకి వ్యతిరేకిస్తూ తెలంగాణా ప్రాంతంలోని కొందరు జిల్లా అధ్యక్షులు రాజీనామా చెయ్యటానికి తయారయ్యారు.  తెలంగాణా ప్రాంతంలో తెలుగు దేశం పార్టీకి ఉన్న వ్యతిరేకత వలన ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే భాజపాకి నష్టం కలుగుతుందని ఆ ప్రాంత నాయకులు జాతీయ నాయకులకు తెలియజేసారు.  వారి మాట వినకపోవటంతో వారంతా రాజీనామా బాట పట్టారు. 

ఈ రోజు ఈ అంశం మీద చర్చించటానికి భాజపా నాయకులు రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ జవదేకర్ తో భేటీ అయ్యారు.  ఈ సమస్యను విస్మరించేది కాదు కాబట్టి పొత్తు విషయంలో ఒక నిర్ణయానికి రావటం కోసం తెలంగాణా భాజపా నాయకులతోపాటు బండారు దత్తాత్రేయ, యెండల లక్ష్మీ నారాయణ, శ్రీనివాస్ లు కూడా భేటీలో హాజరయ్యారు. 

చర్చలు ఇంకా సాగుతున్నాయి. 

తెదేపాతో పొత్తుతో సీమాంధ్రలో భాజపా, భాజపాతో పొత్తుతో తెలంగాణాలో తెదేపా నిలదొక్కుకుందామని చూస్తున్నారు కానీ, తెలంగాణాలో స్థానిక భాజపా నేతలకు ఇది సరైన బేరం కాదన్న అభిప్రాయంగా గట్టిగా ఉన్నట్టుగా కనిపిస్తోంది.

ఆలోచనా సరళిలో స్థానిక నాయకులకు, జాతీయ నాయకులకు చాలా తేడా ఉంటుంది.  కానీ స్థానిక నాయకులు వారి ప్రాంతంలోని ప్రజల నాడిని సరిగ్గా పట్టుకుంటారు కాబట్టి వాళ్ళ సలహాలను కూడా విస్మరించటం సరికాదు.  అందువలన తెదేపాతో పొత్తుల విషయంలో రాష్ట్ర, స్థానిక, జాతీయ స్థాయిల్లో ఏకాభిప్రాయం రావటం కోసం తర్జనభర్జనలు జరుగుతున్నాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles