Summary report on beach sand mining agreement

Report to Governor on Beach sand agreement, Beach Sand Mining Agreement, KVP Ramachandra Rao, APMDC, AP Mining Department

Summary report on Beach Sand mining agreement

కెవిపి ముడుపుల ఉదంతం మీద గవర్నర్ కి నివేదిక

Posted: 04/05/2014 09:00 AM IST
Summary report on beach sand mining agreement

అమెరికన్ దర్యాప్తులో టైటానియం ఒప్పందాల విషయంలో గ్రహించిన వాస్తవాల మీద అంతర్జాతీయ నేరంగా పరిగణించి చేసిన అభియోగాల దృష్ట్యా స్పందించిన ముఖ్య కార్యదర్శి గనుల శాఖ, ఎపిఎమ్ డి సి అధికారలతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.  అందుకు సంబంధించి లోగడ జరిగిన బీచ్ శాండ్ తవ్వకాల మీద జరిగిన ఒప్పందాలను పరిశీలించి, సుదీర్ఘంగా చర్చించారు. 

ఈ వ్యవహారంలో విదేశీ సంస్థైన బోత్లీ తో ఎపిఎమ్ డిసి చేసిన ఒప్పందంలోని వివరాలను సంపూర్ణంగా చూసిన తర్వాత ఎపిఎమ్ డిసి అప్పట్లోనే ఈ ఒప్పందం రద్దుకి సిఫారసు చేసినా దాని మీద ముఖ్యమంత్రి చర్య తీసుకోకపోవటం వలన విషయం జాప్యమైందని తెలుసుకున్నారు. 

కూలంకషంగా చేసిన పరిశీలనలో తేలిన అంశాలనన్నిటినీ పొందుపరచి, గవర్నర్ కి నివేదికనివ్వటానికి రంగం సిద్ధమౌతోంది. 

ఈ రోజు కానీ సోమవారం కానీ గవర్నర్ కి అందజేసే ఈ నివేదక ఆధారంగా గవర్నర్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆ ఒప్పందాన్ని రద్దు చెయ్యటమా వద్దా అన్నది తేలుతుంది.  గవర్నర్ ఒప్పందాన్ని రద్దు చేసినట్లయితే పరిశ్రమ శాఖ దాన్ని అమలుపరచవలసివుంటుంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles