Tdp prajagarjana at warangal

TDP prajagarjana at Warangal, Chandrababu Naidu, KCR, Telugu Desam party, BC as CM of Telangana, TDP poor peoples party

TDP prajagarjana at Warangal, Chandrababu Naidu, KCR, Telugu Desam party, BC as CM of Telangana

ఓరుగల్లులో తెదేపా ప్రజాగర్జన

Posted: 04/03/2014 08:18 AM IST
Tdp prajagarjana at warangal

తెలంగాణా రాష్ట్ర సమితి వచ్చిందంటే మళ్ళీ దొరల రాజ్యం వస్తుందని, తెలుగు దేశం పార్టీ వస్తేనే గరీబుల రాజ్యం అవుతుందని తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బుధవారం వరంగల్ లో జరిగిన ప్రజాగర్జనలో అన్నారు. 

తెదేపా ఉండదని ఆశపడ్డారు కొందరు నేతలు, కానీ ఓరుగల్లు మళ్ళీ తెదేపాకి బ్రహ్మరథం పడుతోంది అన్న చంద్రబాబు  కాకతీయుల చరిత్ర ఈ నాటిది కాదు 860 సంవత్సరాల క్రితందని, ఒక్కో మహిళ రుద్రమ దేవిగా ఒక్కో తమ్ముడు ప్రతాపరుద్రుడిగా తయారవ్వాలని పిలుపునిచ్చారు. 

తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం తెలుగు దేశం పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ అధికారాన్ని పదవులను ఆశించి రాలేదని, భూస్వాములకు, పెత్తందార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసారని అన్నారు చంద్రబాబు.  ఆనాడే తెలంగాణాకి నిజమైన స్వాతంత్రం వచ్చిందని ఆయన తెలియజేసారు.  పటేల్ పట్వారీ వ్యవస్థలను అంతమొందించింది ఎన్టీఆరే అని గుర్తు చేసారాయన. 

తెలంగాణా తెచ్చుకున్న ఘనత కేవలం ప్రాణాలు ధారపోసిన అమరులదని, బలిదానం కెసిఆర్ చెయ్లేదు, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు చెయ్యలేదు అని చంద్రబాబు గుర్తుచేసారు.  అటువంటి త్యాగమూర్తుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇస్తామని చంద్రబాబు మాటిచ్చారు. 

గ్రామ గ్రామాలకు సిమెంట్ రోడ్లు, నీళ్ళు, హైస్కూళ్ళు, కాలేజ్ లు, ఉన్నత విద్యలో మెడికల్ కాలేజ్ లు ఉన్నాయంటే అది కేవలం తెదేపా వలనే వచ్చాయని, సింగపూర్ అభివృద్ధి చెందటానికి 50 సంవత్సరాలు పడితే కేవలం 9 సంవత్సరాలలోనే హైద్రాబాద్ ని అభివృద్ధి చేసామని చంద్రబాబు అన్నారు.  అందువలన తెలంగాణాలో వోట్లు వెయ్యమని అడిగే హక్కు కేవలం తెదేపాకే ఉందని ఆయన అన్నారు. 

కెసిఆర్ మీ ఊరికేమీ చెయ్యలేదని, ఆయన చేసిందల్లా బీడీ కట్టల మీద పుర్రె బొమ్మలను వేయించి బీడీ కార్మికుల పొట్టకొట్టటమేనని చెప్పిన చంద్రబాబు, తన సొంత వూరుని విస్మరించి హైద్రాబాద్ ని అభివృద్ధి చేసానని అన్నారు.  రాజ్యాధికారాన్ని బిసికి అప్పగించాలని అన్నది కూడా తెదేపాయే ఇప్పుడు దానికే కట్టుబడివున్నామని చంద్రబాబు అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles