Kavuri sambasiva rao resigning today

Kavuri Sambasiva Rao resigning, Congress party, Bharatiya Janata party, Telugu Desam party, Kavuri Central Minister

Kavuri Sambasiva Rao resigning, Congress party, Bharatiya Janata party, Telugu Desam party

కావూరి సాంబశివరావు రాజీనామా

Posted: 04/03/2014 07:49 AM IST
Kavuri sambasiva rao resigning today

ఈరోజు కావూరి సాంబశివరావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చెయ్యబోతున్నారు. 

ఏలూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన కావూరి సాంబశివరావు 2013 లో కేంద్ర మంత్రిగా జౌళిశాఖ బాధ్యతలు చేపట్టారు.  రాష్ట్ర విభజనను నిరసిస్తూ కావూరి ఈరోజు కేంద్ర మంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చెయ్యనున్నారు.

రాష్ట్ర విభజన జరగగానే తెలుగు దేశం పార్టీలో చేరదామని ఆశించిన కావూరికి ఆ పార్టీలోని పశ్చిమ గోదావరి జిల్లా నాయకుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. 

ప్రస్తుతమున్న పరిస్థితిలో కావూరి భారతీయ జనతా పార్టీలో చేరటానికే ఎక్కువ అవకాశాలున్నాయి.  అయితే మునుగుతున్న నావగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు పోతున్న సీనియర్ నాయకులనందరికీ భాజపా సీట్ అడ్జస్ట్ మెంట్ చెయ్యటం కష్టంగానే ఉంది.  అదే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి కూడా ఉన్నా, సీమాంధ్రలో భాజపాతో జరిగిన ఒప్పందంలో తెదేపాకి ఎక్కువ స్థానాలే చేతిలో ఉండటం వలన కాస్త నయమే కానీ భాజపాకి మాత్రం ఇంకా నాయకులు పార్టీలోకి వస్తుంటే, బలమైతే పెరుగుతోంది కానీ వాళ్ళని సంతృప్తిపరచటం కూడా కష్టంగానే కనిపిస్తోంది.

1984 లో కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి సారి పార్లమెంటు ఎన్నికలలో గెలిచి అప్పటి నుంచి కాంగ్రెస్ తో ఉన్న ఈ 30 సంవత్సరాల అనుబంధాన్ని తెంచుకుంటూ బయటకు వస్తున్న కావూరి సాంబశివరావు 1989, 1998, 2004, 2009 లలో కూడా వరసగా ఎన్నికయిన సీనియర్ నాయకుడు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles