Charges on kvp and others at chicago

Charges on KVP and others at Chicago, KVP Ramachandra Rao, YS Rajasekhara Reddy, mining for Titanium products, Chicago Federal court

Charges on KVP and others at Chicago, KVP Ramachandra Rao, YS Rajasekhara Reddy, mining for Titanium products

వైయస్ఆర్ ఆత్మ విదేశాలనుంచి నడిపించిన అక్రమం!

Posted: 04/03/2014 09:19 AM IST
Charges on kvp and others at chicago

దివంగత నేత వైయస్ఆర్ ఆత్మగా చెప్పుకునే కెవిపి దేశంలో అవినీతికోసం విదేశాలనుంచి నడిపిన అక్రమ చిట్టా అంతా షికోగా లో బయటపడింది. 

ఎనిమిది సంవత్సరాల క్రితం వైయస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు, టైటానియమ్ ఉత్పత్తులకు పనికివచ్చే ఖనిజాలను ఆంధ్రప్రదేశ్ లో బయటకు తీసి వాటిని విదేశాలలో అమ్మి కోట్లు పోగుచేసుకోవటానికి కెవిపి చేసిన ప్రయత్నాలను అమెరికా ప్రభుత్వం బయటపెట్టటమే కాకుండా, మొత్తం 111 కోట్ల రూపాయలకు గాను 64 కోట్ల రూపాయలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలలో కీలకమైన స్థానాలలో ఉన్నవారికి బట్వాడా చెయ్యటం కూడా జరిగిందని, అక్రమం జరిగింది భారత దేశానికి వ్యతిరేకంగానేనైనా, ఆ నేరంలో అమెరికా భూభాగాన్ని, అమెరికా లోని ఆర్థిక వ్యవస్థలను ఉపయోగించుకున్నందుకు గాను షికాగోలోని ఫెడరల్ కోర్టులో జూన్ 13,2013 లో అభియోగాలు మోపబడ్డాయి.  ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ దాన్ని సీల్ చేసింది.  వాటి వివరాలు బుధవారమే బయటకు వచ్చాయి. 

ఈ కేసును అంతర్జాతీయ కుంభకోణంగా తీసుకున్న అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ ముఠాను ఉపయోగించుకుని తనకు తనవాళ్ళకి లాభం చేకూరటం కోసం ఆర్థిక నేరానికి పాల్పడ్డారన్నది కెవిపి మీద అభియోగం.  ఈ క్రమంలో కెవిపి మీద ఐదు కేసులు నమోదు అయ్యాయి. 

కెవిపికి ఈ అక్రమార్జనలో సహకరించినవారిమీద కూడా అభియోగాలు నమోదయ్యాయి.  వారిలో హంగేరీ కి చెందిన ఆండ్రస్ నాప్ అనే వ్యాపారి, ఉక్రెయిన్ కి చెందిన సురేన్ జెవోర్గాన్, అమెరికా పౌరసత్వంగల భారతీయుడు గజేంద్ర లాల్, శ్రీలంకకు చెందన పెరియస్వామి ఉన్నారు.  ఆ ఆరుగురిమీద పెట్టిన కేసులో నిందితుల ఆస్తులను జప్తు చెయ్యాలని కూడా కోరటమైంది.  ఈ మొత్తం నేరంలో కీలకమైన పాత్ర పోషించిన ఉక్రెయిన్ కి చెందిన దిమిత్రీ షిర్తాష్ ను మార్చి 12 న అరెస్ట్ చేసి 1.74 కోట్ల పూచీకత్తు మీద 21 న విడుదల చేసారు.  షిర్తాఫ్ వైయస్ ఆర్ ని కలిసినట్లుగా కూడా ఆ అభియోగంలో పేర్కొనబడింది. 

గాలి జనార్దన రెడ్డి లా కాకుండా విదేశీ సంస్థకి ఖనిజాలను తవ్వే అనుమతులు ఇప్పించి తద్వారా కోట్లు రాబట్టటం ఉద్దేశ్యంగా, గనుల తవ్వకాలకు ప్రభుత్వ అనుమతులు అవసరం కాబట్టి ఇక్కడ అందుకోసం 110 కోట్ల రూపాయలను లంచాల రూపంలో ఇచ్చేందుకు సిద్ధపడ్డారు.  ఆ లంచాలను విదేశాలలో బ్యాంక్ ఖాతాలు తెరిచి అందులో జమ కట్టేందుకు సుందరలింగం తగు ఏర్పాట్లను చేసారు.  అందులో 64 కోట్లు బదిలీ అయ్యాయి కూడా.  అవన్నీ వివిధ దేశాలలో రిజిస్టరైన 159 కంపెనీల ద్వారా లావాదేవీలు జరిగినట్లుగా దర్యాప్తులో తేలింది.  భారత్ లోని గనుల ద్వారా ఏటా 60 లక్షల టన్నుల టైటానియం స్పాంజ్ ని ఎగుమతి చేసేందుకు ఒప్పందాలు కుదిరాయి. 

అంటే, ఆర్థిక నేరాల ద్వారా అక్రమ ఆర్జన చేసిన కేసుల్లో ఇప్పటి వరకు బయటపడిన కేసులే కాకుండా ఇంకా ఉన్నాయన్నదానికి అమెరికా ప్రభుత్వం తెరదించింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles