Sonia gandhi performs havan before filing nomination

Sonia Gandhi performs Havan before filing nomination, Sonia Gandhi nomination at Raibareli, Congress party President Sonia Gandhi

Sonia Gandhi performs Havan before filing nomination

కంకణం కట్టుకుని యజ్ఞం చేసిన సోనియా గాంధీ

Posted: 04/02/2014 04:23 PM IST
Sonia gandhi performs havan before filing nomination

ఈరోజు రాయబరేలీ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేసిన సోనియా గాంధీ దానికి ముందుగా ఆనవాయితీ ప్రకారం రాహుల్ గాంధీతో కలిసి యజ్ఞం నిర్వహించారు. 

ఉత్తర ప్రదేశ్ లోని రాయబరేలీ కాంగ్రెస్ పార్టీ పెద్దలను గట్టెక్కిస్తూ వచ్చిన స్థానం.  అక్కడ నామినేషన్ దాఖలు చేసేందుకు బయలుదేరిన సోనియా గాంధీని ఆమె కుమారుడు రాహుల్ గాంధీ స్వయంగా కారు నడుపుతూ కలెక్టర్ ఆఫీస్ కి తీసుకుని వెళ్ళారు.  అడుగడుగునా నీరాజనాలతో వెళ్ళటంతో నెమ్మదిగా సాగిన యాత్ర రోడ్ షో లా తయారైంది. 

గతంలో ఫిరోజ్ గాంధీ, ఇందిరా గాంధీ కూడా ఇక్కడి నుండే పోటీ చేసి గెలిచారు.  సోనియా గాంధీ కూడా ఈ స్థానం నుంచే 2004 నుంచి పోటీచేస్తూ వస్తున్నారు.

ఇందిరా గాంధీ సమయం నుంచీ నామినేషన్ కి ముందుగా యజ్ఞం చేసే ఆనవాయితీని గౌరవిస్తూ సోనియా గాంధీ కూడా ఆ తంతుని పూర్తిచేసారీరోజు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles