Congress party went on partying when modi was announced pm candidate

Congress party went on partying when Modi made PM candidate, BJP Prime Minsiterial candidate Narendra Modi, Indian National Congress party, Bharatiya Janata party, Modi asks for Stable Government

Congress party went on partying when Modi was announced PM candidate by BJP

మోదీ ఎంపికతో విందు పార్టీ చేసుకున్న కాంగ్రెస్ పార్టీ?

Posted: 04/02/2014 08:58 AM IST
Congress party went on partying when modi was announced pm candidate

భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఉత్తర ప్రదేశ్ లోని బరేలీ లో మాట్లాడుతూ, "నేను ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఎంపికవటంతోనే కాంగ్రెస్ పార్టీ విందు పార్టీలు చేసుకుంది.  నా వలన ఏ పార్టీ కూడా భాజపాకి మద్దతునివ్వదని, భాజపా ఒంటరిదైపోతుందని ఊహించింది.  కానీ దానికి విరుద్ధంగా దేశవ్యాప్తంగా మాకో డజన్ కొత్త మిత్ర పార్టీలు ఏర్పడ్డాయి.  ఆ తర్వాత వాళ్ళు మాట మార్చి మోదీ కి గుజరాత్ రాష్ట్రంలో మాత్రమే అనుభవముంది కానీ దేశాన్ని నడిపే సామర్ధ్యమెక్కడిది అన్నారు.  దానితోనూ ప్రయోజనం లేకపోయింది.  ఇక ఆఖరు అస్త్రంగా కాంగ్రెస్ పార్టీ అస్థిర ప్రభుత్వం గురించి మాట్లాడుతోంది" అన్నారు. 

ఉత్తర ప్రదేశ్ లోని అన్ని ఎంపీ సీట్లనూ భాజపాకి ఇవ్వమని కోరటమే కాకుండా దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్ డి ఏ కి 300 కి తక్కువ కాకుండా ఎంపీ సీట్లను ఇవ్వమని, దాని వలన సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుందని, 300 మంది ఎంపీల మద్దతు ఉన్నట్లయితే ఆ ప్రధాన మంత్రి మాటలను ప్రపంచమంతా వింటుందని నరేంద్ర మోదీ అన్నారు. 

కాంగ్రెస్ పార్టీకి ఎలాగూ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రత్యామ్నాయంగా సుస్థిరమైన ప్రభుత్వం దేశంలో లేకుండా చెయ్యటమే ఆ పార్టీ ఉద్దేశ్యమని, దానివలన దేశం బలహీనమైనా ఆ పార్టీకి పట్టింపు లేదని అన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles