Pawan kalyan comment on prajarajyam party

Jana Sena Campaign, Pawan Kalyan Powerful Speech, Pawan Kalyan Addresses Youth In Vizag, pawan kalyan in vizag, Pawan Kalyan's Jana Sena Youth Meet in Vizag, Jana Sena Youth Meeting, Pawan kalyan Vizag Public Meeting, Powerstar Pawan Kalyan entry

pawan kalyan comment on prajarajyam party

పిఆర్పీపార్టీ విలీనం తప్పలేదు-నేను పోటీ చేయను?

Posted: 03/27/2014 09:00 PM IST
Pawan kalyan comment on prajarajyam party

విశాఖపట్నంలో జనసేన సభ ఆరంభమైంది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వేదిక పై నుంచి అభిమానులకు అభివాదం తెలిపారు. దీంతో, సభ ప్రాంగణం అభిమానుల నినాదాలతో హోరెత్తిపోయింది. విశాఖపట్నంలో జరుగుతున్న జనసేన సభలో మాట్లాడుతూ....ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయక తప్పలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయకపోతే తాము కాంగ్రెస్ లో కలిసి పోతామని కొంత మంది ఎమ్మెల్యేలు అన్నారని చెప్పారు. తన అన్నయ్య చిరంజీవి అందుకే విలీనం చేశాడని చెప్పారు. 

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అన్నయ్య చిరంజీవి, తాను చెరో వైపు ఉండాల్సి వచ్చిందని.... అది భగవంతుడి లీల అని భావిస్తానని పవన్ అన్నారు. అన్నయ్య పై గౌరవం, ప్రేమ ఏ మాత్రం తగ్గలేదన్నారు. అన్నయ్య  అనుభవంతో తన అనుభవం తక్కువ అని నమ్ముతానని పవన్ చెప్పారు.

నేను పోటీ చేయను:

సమాజం కోసం స్వార్థం లేకుండా ప్రజా సేవకు అంకితమయ్యే నేతలు దొరికే వరకు తాను ఎన్నికల్లో పోటీ చేయని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విశాఖలో జనసేన పార్టీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. స్వార్థం లేని, విలువలు కలిగిన యువకుల కోసం వెతుకుతున్నానని, అలాంటి వ్యక్తులు దొరికిన రోజు సీమాంధ్రలోనూ, తెలంగాణ లోనూ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. 

నవ తెలంగాణను నిర్మాస్తానన్నారు. అప్పటి వరకు ప్రజల తరుపన నిరంతరం జనసేన పార్టీ పోరాడుతూ ఉంటుందని స్పష్టం చేశారు. తనకు ఓట్లను చీల్చడం ఇష్టంలేదని చెప్పారు. ఈ ఎన్నికలలో ప్రజలు తమకు నచ్చిన నాయకులకు ఓటు వేయాలని, నూతన రాజధానిని నిర్మించే సత్తా ఉన్న నాయకునికి ఓటేయానిని సూచించారు.

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles