Pawan kalyan ism book released

Pawan kalyan ISM Book Released, ISB Book, pawan speech, pawan kalyan speech in vizag,

Pawan kalyan ISM Book Released, ISB Book,

'ఇజం' పుస్తకాన్ని భారతజాతికి అంకితం.

Posted: 03/27/2014 08:21 PM IST
Pawan kalyan ism book released

విశాఖపట్నంలో జనసేన సభ ఆరంభమైంది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వేదిక పై నుంచి అభిమానులకు అభివాదం తెలిపారు. దీంతో, సభ ప్రాంగణం అభిమానుల నినాదాలతో హోరెత్తిపోయింది. పవన్  కళ్యాణ్  స్పీచ్ మొదలైంది. 

తన వెనుక బలమైన సిద్ధాంతాలు ఉన్నాయని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. అలాంటి సిద్ధాంతాల సమాహారమే తన ఇజం పుస్తకమని పేర్కొన్నారు. ఈ పుస్తకాన్ని భారతజాతికి అంకితమిస్తున్నట్టు సభ సాక్షిగా ప్రకటించారు. అవినీతిమయ రాజకీయాలను మార్చాలంటే బలమైన సిద్ధాంతం కావాలని 'ఇజం' తన పార్టీ బలమని వివరించారు.

గాంధీలు కాలేరు: 

జనసేన సభలో పవన్ కల్యాణ్ కాంగ్రెస్ పెద్దలు సోనియా, రాహుల్ లపై సెటైర్లు వేశారు. జాతిపిత పేరును ఇంటిపేరుగా పెట్టుకున్నంత మాత్రాన జాతిపితలు కాలేరని వ్యాఖ్యానించారు. తెలుగుజాతి ఐక్యతకు ముప్పు తెచ్చింది కాంగ్రెస్ వాదులేనని పవన్ ఈ సందర్భంగా మండిపడ్డారు. భారత జాతి సమగ్రతకు వాళ్ళు తూట్లు పొడిచారని ఆయన దుయ్యబట్టారు.

అది చాలు...

రాజకీయ నాయకుల వేష భాషలు తనకు రావని జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ తెలిపారు. ఎన్నికల సీజన్ కారణంగా ఖద్దరు బట్టలకు డిమాండ్ పెరిగి చాలా ఖరీదైపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈరోజు సాయంత్రం విశాఖలో ప్రారంభమైన జనసేన తొలి బహిరంగ సభలో పవన్ పాల్గొని ప్రసంగించారు. 

ప్రసిద్ధ హిందీ నటుడు రాజ్ కపూర్ చెప్పినట్లుగా తనకు హిందుస్థానీ హృదయం ఉందని పవన్ పేర్కొన్నారు. వేసుకున్న ప్యాంట్ అమెరికాదైనా, టోపీ రష్యాదైనా మనసు మాత్రం భారత్ దేనని పవన్ స్పష్టం చేశారు. అధికారం కోసమో, ఓట్ల కోసమో రాజకీయాల్లోకి రాలేదని, సామాజిక స్పృహతోనే తాను పార్టీని స్థాపించినట్టు పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు.

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles