Hindi film actress nanda passes away

Hindi film actress Nanda passes away, Director V Shataram, Shashi Kapoor, Rajesh Khanna, Actress Vaheeda Rehman

Hindi film actress Nanda passes away

హిందీ నటి నందా ఇక లేరు

Posted: 03/25/2014 02:58 PM IST
Hindi film actress nanda passes away

అలనాటి హిందీ సినిమా రంగంలోని మేటి నటి నందా (75) ఈరోజు తన స్వగృహంలో హద్వేగంతో కన్నుమూసారు.  అవివాహితగానే జీవితాన్ని గడిపిన నందా బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసి కుటుంబ భారాన్ని మోసారు.  ఆమె దగ్గర బంధువైన ప్రముఖ దర్శకుడు వి.శాంతారామ్ ఆమెకు తుఫాన్ ఔర్ దియా చిత్రంలో ప్రధాన పాత్రనిచ్చారు.  భాభీ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టగా, ఎల్ వి ప్రసాద్ తీసిన ఛోటీ బెహన్ నందాకు స్టార్డమ్ ని తెచ్చిపెట్టింది.  

జనవరి 8, 1939 లో కోల్హాపూర్ లో జన్మించిన నందా హిందీ మరాఠీ సినిమాలలో నటించారు.  

ఆమె నటించిన సినిమాలలో హమ దోనోఁ, కాలా బజార్, ధూల్ కా ఫూల్, ది ట్రైన్, జోరూకా గులామ్, కానూన్, జబ్ జబ్ ఫూల్ ఖిలేఁ, షోర్, బడీ దీదీ, ఆకాశ్ దీప్, గుమ్నామ్ లాంటి మంచి సినిమాలున్నాయి.  ఆంచల్ సినిమాలో ఆమె నటనకు ఉత్తమ సహాయనటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ లభించింది.

ఆమె మరణ వార్త వినగానే పాత నటులు వహీదా రెహమాన్, మనోజ్ కుమార్ లు దుఖ్ఖాన్ని ప్రకటించారు.  శశికపూర్, రాజేష్ ఖన్నాలతో కూడా నందా నటించారు.  1983 లో విడుదలైన ప్రేమ్ రోగ్ ఆమె ఆఖరి చిత్రం.  

ఆమె తోటి నటీ నటులు, నిర్మాతలు, దర్శకులు, ఆమె సాయంతో పైకి వచ్చినవారు పాత సినీ ప్రేమికులలో ఆమె అభిమానులు నందా మృతి పట్ల సంతాపాన్ని వెలిబుచ్చారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh