Family members priority in political parties

Family members priority in political parties, Lok Satta party jaya Prakash Narayana, TRS party, K Chandrasekhara Rao, Elections 2014

Family members priority in political parties

పార్టీలలో కుటుంబ వ్యవస్థ శుభపరిణామం కాదు- జెపి

Posted: 03/25/2014 03:54 PM IST
Family members priority in political parties

కుటుంబ సామ్రాజ్యాలుగా ఎదుగుతున్న రాజకీయ పార్టీలు తమను తాము సమర్థించుకుందామని ఏం చెప్పినా అది సరి కాదని, పార్టీలలో కుటుంబ వ్యవస్థలు శుభపరిణామం కాదని లోక్ సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. 

కుటంబ సభ్యులు పార్టీలో ఉంటే తప్పేమిటని నిన్న తెరాస అధ్యక్షుడు కెసిఆర్ ప్రశ్నించారు.  తన కొడుకు, కూతురు, మేనల్లుడు ఉద్యమంలో పాల్గొన్నవారని, రోడ్ల మీదకు వచ్చినవారని, జైల్లో గడిపినవారని, అంతే కాకుండా వాళ్ళు సమర్ధులు కాబట్టి నాయకులుగా వ్యవహరిస్తున్నారని అన్న కెసిఆర్ మాటలకు ఆయన పేరు ఎత్తకోపయినా జెపి వ్యాఖ్యలు జవాబు చెప్పినట్లుగానే ఉన్నాయి. 

తన పార్టీ కార్యాలయంలో మాట్లాడిని జెపి రాష్ట్రంలో ఈసారి 70 లక్షల మంది యువతి మొదటిసారిగా ఓటు వెయ్యటానికి అర్హత కలిగివున్నారని చెప్తూ, మొత్తం వోటర్లలో 50 శాతం యువతే ఉన్నారని అన్నారు.  అందువలన అందులోనూ సమర్ధవంతులున్నారు కనుక పార్టీ అధినాయకత్వం మొండిగా తమ వైఖరిని సమర్థించుకుంటూ తమ కుటుంబ సభ్యులకే ప్రాధాన్యతనివ్వటం సరికాదని అన్నారు. 

యువతను ఉద్దేశిస్తూ, రాజకీయాల్లోకి వచ్చేందుకు అర్హతలున్నవారు అధిక సంఖ్యలోనే ఉన్నారు కాబట్టి మనందరం రాజకీయ నాయకుల పిల్లలతో సమానందా ఎదగాలని, ఆత్మగౌరవంతో బతకాలని అన్నారు. 

దేశవ్యాప్తంగా రెండు కోట్ల మంది యువతీయువకులు ఈ ఎన్నికలలో మొదటిసారిగా వోటు వేయబోతున్నారని, అందువలన మార్పనేది యువత నుంచే రావాలని, యువత ముందుకు వచ్చి రాజకీయాల్లో క్రియాశీల పాత్రను పోషించాలని జయప్రకాశ్ నారాయణ పిలుపునిచ్చారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles