56 crores of rupees seized electoral officer bhanwarlal says

56 crores of rupees seized, State Chief Electoral Officer Bhanwarlal, Election 2014, EVM storage at Warangal, Additional forces for 2014 elections

56 crores of rupees seized State Chief Electoral Officer Bhanwarlal says

తనిఖీలలో పట్టుబడ్డ నగదు 56 కోట్లు

Posted: 03/25/2014 11:12 AM IST
56 crores of rupees seized electoral officer bhanwarlal says

రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా జరుగుతున్న తనిఖీలలో రూ.56 కోట్లు పట్టుబడ్డాయని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ తెలియజేసారు.  

వరంగల్ కలెక్టరేట్ లో ఈవిఎమ్ లను భద్రపరచే కార్యాలయాన్ని ప్రారంభించిన భన్వర్ లాల్, అక్కడ జరిగిన మీడియా సమావేశంలో, రాష్ట్రంలో అన్ని పోలింగ్ కేంద్రాలలో కనీస వసతులను కల్పించనున్నామని అన్నారు.  

ఎన్నికలు సజావుగా జరిగేట్టుగా చూసే బాధ్యతలను చేపట్టే ఎన్నికల కమిషన్ ఈ సారి ఎన్నికలలో పోటీ ఎక్కువగా ఉండటమే కాకుండా రాష్ట్ర విభజన దృష్ట్యా కూడా అల్లర్లు జరగకుండా, ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండటం కోసం కేంద్రం నుంచి అదనంగా 352 కంపెనీల బలగాలను ఎన్నికల బందోబస్తులో నియమించినట్లుగా భన్వర్ లాల్ తెలియజేసారు.  

మన రాష్ట్రంలో తెలంగాణా ప్రాంతంలో ఏప్రిల్ 30 న శేషాంధ్రప్రదేశ్ లో మే 7 న సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి.  అందుకు ఎన్నికల కమిషన్ అన్ని రకాల కసరత్తులూ చేస్తోంది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles