Malaysian mh 370 accident confirmed

Malaysian MH 370 accident confirmed, Malaysian PM confirms MH 370 submerge in sea, Malaysian plane mishap

Malaysian MH 370 accident confirmed by Malaysian Prime Minister

239 మందితో మలేషియా విమానం జలసమాధి

Posted: 03/25/2014 08:22 AM IST
Malaysian mh 370 accident confirmed

కౌలాలంపూర్ నుంచి బీజింగ్ కి బయలుదేరిన మలేషియా విమానం సముద్రంలో పడిపోయిందని, అందులో ప్రయాణం చేసినవారంతా ప్రాణాలు పోగొట్టుకున్నారని, మలేషియా సోమవారం రాత్రి అధికారికంగా ప్రకటించింది.  26 దేశాలు నిర్విరామంగా చేసిన అన్వేషణలో రోజుకో ప్రకటన వెలివడటంతో కొన ఆశతో ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులకు ఈ వార్త పెనుఘాతమే నంటూ మలేషియా ప్రధాన మంత్రి  నిజీబ్ రజాక్ మీడియా సమావేశంలో అన్నారు.  ఆ విమానం దక్షిణ హిందూ మహా సముద్రంలో పడిపోయిందని అన్వేషిస్తూ వచ్చిన దేశాలన్నీ రూఢిచేసుకున్నాయి. 

ప్రమాదానికి గురైన విమానం లోని ప్రయాణీకుల కుటుంబ సభ్యులకు మలేషియా ప్రభుత్వం కౌలాలంపూర్ లో హోటల్లో బస ఏర్పాటు చేసింది.  వాళ్ళంతా అన్వేషణా కార్యకలాపాలను స్వయంగా చూస్తూ వచ్చారు.  ఇక ఆ విమానంలో ఎవరూ మిగలలేదు, అందరూ చనిపోయారని తెలవగానే వాళ్ళ దుఖ్ఖం కట్టలు తెంచుకుంది. 

మార్చి 8 న కౌలాలంపూర్ లో బయలుదేరిన మలేషియాకు చెందిన ఎమ్ హెచ్ 370 పౌర విమానంలో ప్రయాణం చేసిన 239 మందిలో 13 మంది విమాన సిబ్బంది, 226 మంది ప్రయాణీకులున్నారు.  అందులో ఎక్కువ మంది చైనా దేశస్తులే.  చైనా దేశస్తులు 154 మందైతే మిగిలినవారిలో వివిధ దేశస్తులున్నారు.  వారిలో ఐదుగురు భారతీయులు.  అందులో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. 

ఈ ప్రమాదం మీద దర్యాప్తు సాగుతోంది.  అయితే ఇది ఎలా జరిగిందన్నది అంతుపట్టకుండా ఉంది.  విమాన ప్రమాదాల చరిత్రలో ఇదే సుదీర్ఘ అన్వేషణ తర్వాత కూడా అంతుచిక్కని ఘటన.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles