Star beeline to modi

Star beeline to Modi, BJP Narendra Modi, Pawan Kalyan Janasena, TDP Chandrababu Naidu, Loksatta Jayaprakash Narayan, Actor Nagarjuna, Actor Brahmanandam, Actor Mohan Babu

Star beeline to Modi, BJP Narendra Modi, Pawan Kalyan Janasena, TDP Chandrababu Naidu, Loksatta Jayaprakash Narayan

మోదీ దగ్గరకు స్టార్ లైన్

Posted: 03/25/2014 07:37 AM IST
Star beeline to modi

పవన్ కళ్యాణ్ బోణీ చాలా మంచిదనిపిస్తోంది. 

ఆయన ఏ ముహూర్తాన మోదీని కలవటానికి వెళ్ళారో కానీ మన తెలుగు నటులంతా క్యూకడుతున్నారు.  నాగార్జున వెళ్ళి కలిసి వచ్చారు, బ్రహ్మానందం, మోహన్ బాబు మోదీ అప్పాయింట్ మెంటు తీసుకుంటున్నారు. 

భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి గత సంవత్సర కాలంగా దేశ వ్యాప్తంగానే కాకుండా అగ్ర రాజ్యాలలో కూడా తన ప్రాభవాన్ని పెంచుకున్నారు, దానితో పాటే భాజపాకి కూడా శక్తివంతమైన పార్టీ అనే అభిప్రాయాన్ని కలిగించారు.  కాంగ్రెస్ పార్టీ ఇక బ్రతికి బట్టకట్టటం కష్టమేనన్న భావన కలిగేట్టుగా చేసారాయన. 

ఇక మన రాష్ట్రంలో చూసుకుంటే రాష్ట్ర విభజనకు మద్దతును ప్రకటించిన భాజపా తెలంగాణాలో బలం పుంజుకుంది.  చివరకు తెలంగాణా రాష్ట్రం తమ వలనే ఏర్పడుతోందన్న అభిప్రాయాన్ని కూడా తెలంగాణా ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తోంది.  అయితే సీమాంధ్రలో కూడా అధికారాన్ని సంపాదించాలంటే ప్రస్తుతం ఇక్కడ మరోసారి పుంజుకుంటున్న తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చెయ్యవలసిందేనని రాష్ట్ర విభజన కాకముందే గ్రహించిన భాజపా హైద్రాబాద్ లో జరిగిన మోదీ సభలో తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ని గుర్తు చేసుకోవటం, తెదేపా వైపు మైత్రీ హస్తాన్ని సారించటం జరిగింది. 

ఇప్పడు తెదేపాతో పాటు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన, జయప్రకాశ్ నారాయణ లోక్ సత్తా పార్టీలు కూడా భాజపాకు మద్దతు తెలుపుతున్నాయి.  ఈ పరిస్థితుల్లో హైద్రాబాద్ లోని ఆస్తులను పరిరక్షించటానికి, సినిమా రంగాన్ని కాపుకాయటానికి ప్రభుత్వ అండదండలు ఎంతో అవసరం. 

అందువలన రాజకీయంగా పైకి రావాలని అనుకునేవాళ్ళే కాకుండా రాజకీయంగా ఎదగాలని మాకు ఎలాంటి ఆసక్తి లేదు, పదవులు అసలే వద్దు అని అనే నటులు కూడా  మోదీ ఫ్యాన్ క్లబ్ లో చేరటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. 

తెలుగు ప్రజలలో వీళ్ళకున్న అభిమానులు ఈ విధంగా భాజపా గెలుపుకి కారణభూతమౌతుందని భాజపా కూడా నమ్ముతోంది.  అయితే మా తెలుగు నటులు రాజకీయంగా ఉపయోగపడాలంటే మాకూ రాష్ట్రంలో బలం ఉందని నమ్మాలని తెదేపా చెప్పే ప్రయత్నం చేస్తోందని కొందరు విశ్లేషకుల వాదన.  అంటే భాజపాతో పొత్తులో తెదేపాకి అనుకూలంగా సీట్ అడ్జెస్ట్ మెంట్లు జరగటానికి స్టార్స్ మద్దతుని తెదేపాయే మోదీ ఎదుట ప్రదర్శిస్తోందని వాళ్ళ ఉద్దేశ్యం.

ఇదే కాకుండా సీమాంధ్రను సింగపూర్ చేస్తానన్న చంద్రబాబు నాయుడు హైద్రాబాద్ లోని అభివృద్ధిని షోకేస్ గా వాడుకుంటున్నారు.  అంటే ఆయన ఏం చెయ్యగలరన్నది ఈ విధంగా చూపించటమే కాకుండా, గత రెండు సార్లు కాంగ్రెస్ కే పట్టం కట్టటం వలన ఆ పది సంవత్సరాలలో ఎంత చెయ్యలేకపోయామన్నది కూడా తెదేపా చెప్పటానికి అవకాశం ఏర్పడింది.  ఇది కూడా భాజపాతో పొత్తులో ఉపకరించే అంశమే.

అలా తెలుగు నటులను తమకున్న తారాబలంగా తెదేపా చూపిస్తోందని రాజకీయ విశ్లేషకుల అంచనా. 

ఏం చేసినా, ఎలా చేసినా లక్ష్యాన్ని ముందు చేరుకున్నవాళ్ళదే గెలుపు.  అందువలన శక్తినంతా ఉపయోగించి ముందుకు పరిగెత్తాల్సిందే.  మరో విషయమేమిటంటే, నిజంగా పనిచేసేవాళ్ళకి కూడా అధికారం చేజిక్కించుకోవటం అవసరమే.  ప్రజా శ్రేయస్సుని కోరుకునేవారు కూడా వేరొకరికి అధికారం వస్తే వాళ్ళ సంక్షేమాన్ని సరిగ్గా పట్టించుకోరేమో అనుకుని కూడా వారిని అధికారంలోకి రానివ్వకుండా చెయ్యటం కూడా అవసరమే. 

అందువలన, రాజకీయపు ఎత్తులు పై ఎత్తులలో ఎవరినీ తప్పుపట్టటానికి లేదు!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles