Kcr says modi or any other will not do anything for telangana

KCR says Modi or any other will not do anything for Telangana, Telangana Rashtra Samiti, K Chandrasekhara Rao, Narendra Modi, KCR promises flats to all, KCR promises free education to all children

KCR says Modi or any other will not do anything for Telangana

మన రాష్ట్రం మన పార్టీ- కెసిఆర్ పిలుపు

Posted: 03/25/2014 08:47 AM IST
Kcr says modi or any other will not do anything for telangana

ఇది మన రాష్ట్రం, దీని బాగోగులు మనమే చూసుకోవాలి, అందువలన మనం మన పార్టీనే గెలిపించాలి అన్నది తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు నినాదం.  అన్ని 17 ఎంపీ సీట్లను మనమే గెలవాలి అప్పుడే ఢిల్లీని శాసించగలుగుతాం అన్నది కెసిఆర్ వాదన.  

ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు కూడా మన పార్టీ నుంచే గెలవాలన్న సూచన కెసిఆర్ చెయ్యటానికి, మోదీ గీదీ మనకేం చెయ్యరు, ఆంధ్రోళ్ళను అడ్డుకోవాలంటే మన సంపూర్ణ అధికారాన్ని సంపాదించాలి అని ప్రత్యేకంగా చెప్పటానికి కారణం, కొందరు రాష్ట్రంలో శాసనసభకు తెరాసను గెలిపించినా లోక్ సభకు భాజపాకే వోటెయ్యాలంటూ చెప్పుకుంటూ వస్తున్నారని కెసిఆర్ చెవిన పడటం.  

ఒక వోటు మనకి, రెండో వోటు మరొకరికి అనే భ్రమలు వదిలిపెట్టండంటూ కెసిఆర్ పిలుపునిచ్చారు.  తెలంగాణా ప్రజలకు కోటి ఆశలున్నాయని, వాటిని నెరవేర్చటానికి, ప్రజల బాధలు సమస్యలను తీర్చటానికి టిఆర్ఎస్ అధికారంలోకి రావటం తప్పనిసరని కెసిఆర్ చెప్తున్నారు.  

చరిత్రలో జరగని విధంగా తెలంగాణా అభివృద్ధి చేసి చూపిస్తామని, ప్రతి కుటుంబానికీ 3 లక్షల వ్యయంతో డబల్ బెడ్ రూం ఫ్లాట్ నిర్మించి ఇస్తామని కెసిఆర్ వాగ్దానం చేస్తున్నారు.  ఇంకా, పిల్లలకు ఉచిత విద్య, దళితుల సంక్షేమం కోసం 50 వేల కోట్ల కేటాయింపులను కూడా కెసిఆర్, తెరాస అధికారంలోకి వస్తే చేసే పనుల్లో ప్రముఖంగా చెప్పారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles