Sc asks govt to withdraw orders making aadhar compulsory

SC asks Govt withdraw orders making Aadhar compulsory, Unique Identification Authority of India, UIDAI not to divulge biometric data,

SC asks Govt to withdraw orders making Aadhar compulsory

ఆధార్ ని తక్షణమే తొలగించండి- సుప్రీం ఆదేశాలు

Posted: 03/24/2014 02:02 PM IST
Sc asks govt to withdraw orders making aadhar compulsory

ఆధార్ కార్డ్ ని తప్పనిసరి చేసిన ప్రభుత్వం దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలంటూ సుప్రీం కోర్ట్ ఈ రోజు ఆదేశాలిచ్చింది. 

జస్టిస్ బిఎస్ చౌహాన్ నేతృత్వంలో ధర్మాసనం ఈ రోజు, కోర్టు ఆదేశాలను పాటించకుండా ఇంకా ఆధార్ ని తప్పనిసరి చేస్తున్నారంటూ ఎన్నో లేఖలు వస్తున్నాయని, ఆధార్ లేకపోవటం వలన తన వివాహాన్ని నమోదు చెయ్యటానికి కూడా రిజిస్ట్రార్ నిరాకరించారన్న లేఖ కూడా వచ్చిందని, అలాగే వివిధ రిజిస్ట్రేషన్లు కూడా ఆధార్ లేకపోవటం వలన జరగటం లేదని ఆరోపణలు వస్తున్నాయని, ఒకవేళ అలా ఆధార్ ని తప్పని సరి చేస్తూ ప్రభుత్వ ఆదేశాలేమైనా ఉంటే వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. 

దానితో పాటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా పేరుతో వ్యవహరిస్తున్న ప్రభుత్వ ఏజెన్సీ వాళ్ళు సేకరించిన బయోమెట్రిక్ డేటాను ఎవరికీ అందజేయరాదని కూడా సుప్రీం కోర్టు ఆదేశాలను జారీచేసింది. 

ఫొటోతో పాటు రెండు చేతులు పది వేలి ముద్రలు, రెండు కళ్ళలోని కంటి పాప వివరాలు నమోదు చేసుకున్న ఆధార్ సంస్థ 2009 వ సంవత్సరం జనవరి 28 న స్వచ్ఛందంగా వివరాలను ఇచ్చి సంక్షేమ పథకాల ప్రయోజనాన్ని పొందటం కోసం ఆవిర్భవించింది.  దానితో పాటే 12 సంఖ్యల నంబర్ ని కూడా కేటాయించటం మొదలుపెట్టింది. 

ఆధార్ నంబర్ ని తీసుకోవటం తప్పని చెయ్యరాదని కోర్టులు గతంలో ఎన్నోసార్లు స్పష్టంగా చెప్పటం జరిగింది.  అయినా ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్ లు ఆధార్ నంబర్ తప్పనిసరిగా కావాలని కోరుతున్నారు.  దాని మీద ఆగ్రహించిన సుప్రీం కోర్టు ఆ దిశగా ప్రభుత్వం ఆదేశాలను జారీచేసివున్నట్లయితే వాటిని ఉపసంహరించుకోవాలంటూ ఈ రోజు స్పష్టంగా తెలియజేసింది. 

ఆధార్ నంబర్ తీసుకోవటం కోసం ఎంత ప్రచారం చేసారో అది తప్పని సరి కాదని కూడా అంత ప్రచారం చేస్తే కానీ అందరికీ ఆ విషయం జీర్ణం కావటం లేదు అనిపిస్తోంది.  అయితే, ఈ మధ్యకాలంలోనే ఆధార్ లింక్ ని వంట గ్యాస్ నుంచి తొలగించటంతో పౌరులకు కొంత అవగాహనైతే వచ్చింది కానీ కార్యాలయాలలో సిబ్బందికి ఇంకా చాలా చోట్ల ఈ విషయం అర్థం కానట్టుగా ఉంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles