Atms operation on windows xp may face problem from april 8

ATMs operation on Windows XP face problem, Security problem to ATMs from April 8, Windows 7, Windows 8, Windows XP time out

ATMs operation on Windows XP may face problem from April 8

ఏప్రిల్ 8 నుంచి ఎటిఎమ్ లకు భద్రతా సమస్య

Posted: 03/24/2014 12:51 PM IST
Atms operation on windows xp may face problem from april 8

విండోస్ ఎక్స్ పి సపోర్ట్ కి ఏప్రిల్ 8 తో కాలం చెల్లిపోతోంది.  అందువలన ఇంకా అదే ప్లాట్ ఫాం మీద నడిచే బ్యాంక్ ఎటిఎమ్ లకు సురక్షా కవచం ఉండదంటూ మైక్రో సాఫ్ట్ కంపెనీ భారతీయ జనరల్ మేనేజర్ అమ్రీష్ గోయల్ హెచ్చరిస్తున్నారు. 

కార్పోరేట్ విభాగంలో 84 శాతం పిసిలను అప్ గ్రేడ్ చేసుకున్నారని, ఇంకా 16 శాతం మాత్రమే అప్ గ్రేడ్ చెయ్యవలసివుందని, కానీ ఏటిఎమ్ ల విషయానికి వచ్చేసరికి అప్ గ్రేడ్ చెయ్యని శాతం ఇంకా అధికంగా ఉందని తెలుస్తోంది. 

విండోస్ ఎక్స్ పి అక్టోబర్ 2001 లో ప్రవేశపెట్టగా ఆ తర్వాత విండోస్ 7, అక్టోబర్ 2012 లో విండోస్ 8 కూడా మార్కెట్ లోకి వచ్చాయి.  కానీ ఇంకా 12 సంవత్సరాల క్రితం వచ్చిన ఎక్స్ పి వర్షన్ వాడటం వలన ఆధునికీకరణను ఉపయోగించుకోకుండా సాంకేతికంగా వెనకబడిపోవటం జరుగుతుంది. 

ఏటిఎమ్ లతో పాటు బ్యాంక్ లు, ఆర్థిక సంస్థలలో ఇంకా 35 శాతం కంప్యూటర్లు విండోస్ ఎక్స్ పి నే వాడుతున్నాయని అమ్రిష్ గోయల్ అన్నారు.  ఈ విషయంలో బ్యాంక్ లకు రిజర్వ్ బ్యాంక్ నుంచి కూడా సూచనలు అందాయి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles