Jaswant singh files nomination as independent candidate

Jaswant Singh files nomination, Jaswant Singh as independent candidate, Bharatiya Janata party, Arun Jaitley, Barmar constituency, Jaswant Singh agains BJP

Jaswant Singh files nomination as independent candidate

స్వతంత్ర అభ్యర్థిగా జస్వంత్ సింగ్ నామినేషన్

Posted: 03/24/2014 02:42 PM IST
Jaswant singh files nomination as independent candidate

భారతీయ జనతాపార్టీకి చెందిన జస్వంత్ సింగ్ (76) ఈ రోజు నాలుగు ప్రతులలో రాజస్తాన్ లోని బార్మర్ నియోజకవర్గానికి తన నామినేషన్ ని ఫైల్ చేసారు.  అదే స్థానానికి భాజపాలో గత వారంలోనే చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సోనారామ్ చౌధరీకి కేటాయించటం పై కినుక వహించిన జస్వంత్ సింగ్ పార్టీ ఇవ్వకపోయినా ఆ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చెయ్యటానికి నిర్ణయించుకున్నారు. 

నామినేషన్ ఫైల్ చేసిన జస్వంత్ సింగ్, "నేను సిద్ధాంతాలకు లోబడి ఆత్మగౌరవం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను.  ఇది నా ఆత్మగౌరవమే కాదు బార్మర్ పౌరులందరి ఆత్మగౌరవం కోసం తీసుకున్న చర్య" అన్నారు.  ఆదివారం మీడియాలో భాజపా సీట్ అడ్జస్ట్ మెంట్ గురించి మాట్లాడుతూ, "నేను ఆఫీస్ ఫర్నిచర్ ని కాదు ఒకచోట కాకపోతే మరోచోట వెయ్యటానికి" అన్నారు.  భాజపాలో జరుగుతున్న మార్పుల వెనకనున్న ఆలోచనలు, వాళ్ళ స్వభావాలు నాకు అర్థమౌతూనేవున్నాయి అన్నారు జస్వంత్ సింగ్ వేదనగా. 

ఈ విషయంలో అరుణ్ జైట్లీ మాట్లాడుతూ, "మౌనంగా ఉండటమే సంస్కారం.  అనవసరమైన రాద్ధాంతం చేసుకోవటం వలన ఎవరికీ ప్రయోజనం ఉండదు.  సహనం చాలా అవసరం" అని అన్నారు. 

అయితే బార్మర్ సీటు కావాలని పట్టుబట్టి, ఆ స్థానాన్ని ఇవ్వనందుకు ఆగ్రహాన్ని ప్రదర్శించి పార్టీకి వ్యతిరేకంగా పోతున్న జస్వంత్ సింగ్ లోగడ మూడు సార్లు పార్లమెంటు కోసం మూడు చోట్ల నుంచి పోటీ చేసారు.  జోధ్ పూర్, చిత్తోర్ ఘఢ్, డార్జిలింగ్.  అందులో మొదటి రెండు రాజస్థాన్ వయితే మూడవది పశ్చిమ బెంగాల్ లోది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles