Election campaigning is taken as challenge chiranjeevi says

Election campaigning is taken as challenge chiranjeevi says, Congress election campaign in charge, Union Minister Chiranjeevi, Pawan Kalyan, Congress party new leaders, Congress defected leaders

Election campaigning is taken as challenge chiranjeevi says

ఎన్నికల ప్రచార బాధ్యతలు ఒక ఛాలెంజ్- చిరంజీవి

Posted: 03/24/2014 12:16 PM IST
Election campaigning is taken as challenge chiranjeevi says

అన్నీ అమర్చివుంటే ఎన్నైనా మాట్లాడొచ్చు.  కానీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు దాన్ని ధైర్యంగా భుజాలకెత్తుకోవటమే ధీరోదాత్తమైన పని. 

ఈరోజు కాంగ్రెస్ బస్సు యాత్రలో విజయవాడలో మాట్లాడిన చిరంజీవి ఎన్నికల కోసం ప్రచారం చేసే బాధ్యతను పార్టీ తన మీద పెట్టినందుకు దాన్ని ఛాలెంజ్ గా తీసుకుంటానని అన్నారు. 

బస్సు యాత్రను ప్రారంభించినప్పుడు కొంత నిరాశ ఉండటం వాస్తవమేనని అయితే బస్సు యాత్రలో కార్యకర్తలు పార్టీలో ఉత్సాహాన్ని నింపారని చిరంజీవి అన్నారు.  రాష్ట్ర విభజన వలన సీమాంధ్ర కాంగ్రెస్ లో నూన్యతా భావం వచ్చిన విషయం నిజమే కానీ రాష్ట్రం విడిపోవటం వలన ప్రయోజనాలు కూడా కలుగుతున్నాయని, రాష్ట్రవిభజన వలనే పోలవరం వస్తోందని అన్నారాయన. 

పార్టీ నాయకులు వీడిపోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ, దాని వలన పార్టీలోకి కొత్త నీరు రావటం కూడా జరుగుతోందన్నారు చిరంజీవి. 

చిరంజీవికి పవన్ విషయంలో కూడా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతోంది.  చిరంజీవి అభిమానులు, పవన్ అభిమానులుగా చీలిపోతున్నారు కదా అన్న విషయం మీద మాట్లాడుతూ, తనకి తన కొడుకైనా, తమ్ముడైనా, అభిమానులైనా ఎవరైనా ఒకటేనని, వాళ్ళకి స్వతంత్రంగా ఆలోచించి తమదైన నిర్ణయాలు తీసుకునే హక్కుందని అన్నారు చిరంజీవి.  అంటే ఎవరు ఎవరికైనా మద్దతునిచ్చే అధికారం వాళ్ళకుందన్న విషయాన్ని తెలియజేసారు. 

తనకి అధిష్టానం ఇచ్చిన బాధ్యతను చిరంజీవి తన పూర్తి శక్తియుక్తులు, సంపూర్ణమైన ప్రమేయంతో నెరవేరుస్తానని చెప్తూ, శ్రీకాకుళం నుంచి బయలుదేరిన కాంగ్రెస్ బస్సు యాత్రలో పార్టీకి ప్రజలు, కార్యకర్తల వలన మనోధైర్యం పెరిగిందని తెలియజేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles