Criticisms and promises of jagan in road show

criticisms and promises of Jagan in road show, YSR Congress party, YS Jagan, TDP Chandrababu Naidu, Jagan welfare schemes

criticisms and promises of Jagan in road show

గంగిరెద్దులతో కెసిఆర్ పోలిస్తే పగటివేషగాళ్ళన్న జగన్

Posted: 03/24/2014 11:50 AM IST
Criticisms and promises of jagan in road show

తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలులో రోడ్ షో నిర్వహించిన వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ ప్రచార సారధి చిరంజీవిని పగటివేషగాడని విమర్శించారు.  లోగడ తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షడు కె చంద్రశేఖరరావు, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టబోతున్నారని తెలిసిన విషయంలో ముచ్చటిస్తూ, సంక్రాంతికి వచ్చే గంగిరెద్దుల లాంటివి ఈ పార్టీలని అనటమే కాకుండా, అన్న దుకాణం మూసేస్తే తమ్ముడు తెరుస్తున్నాడా అంటూ వ్యంగ్యోక్తులను విసిరారు. 

ఆదివారం రోడ్ షోలో మాట్లాడిన జగన్ 2019 నాటికల్లా ఆంధ్రప్రదేశ్ ని కరెంటు కోతలు లేని రాష్ట్రంగా తీర్చి దిద్దటం జరుగుతుందని, ఐదు సంతకాలతో రాష్ట్ర చరిత్రనే మార్చేస్తానని అన్నారు.  అయితే నిబంధన సహజంగానే ఏమిటంటే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడితే అని. 

రాష్ట్ర చరిత్రను మార్చివేస్తాయని జగన్ చెప్పిన ఆ ఐదు సంతకాలు ఇవి- 1. అమ్మ బడి పథకంలో పాఠశాలలో చదువుకునే పిల్లలకు ఒకరికి రూ.500 చొప్పున ఇద్దరు పిల్లల వరకు మహిళల ఖాతాలో జమ చెయ్యబడుతుంది.  2. పెన్షన్ ని రూ.700 కు పెంపు, 3. రైతుల సంక్షేమం కోసం 3000 కోట్ల రూపాయలతో నిధి, 4. డ్వాక్ర ఋణాల మాఫీ, 5. ఇళ్ళు, రేషన్, ఆరోగ్యశ్రీ కార్డుల మంజూరీ కేవలం 24 గంటల్లో జరిగేందుకు వీలుగా వార్డులలోనే కార్యలయాలు. 

తన వన్నీ నిజమైన వాగ్దానాలే కానీ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఉచితంగా ఇస్తానని చెప్పేవన్నీ భూటకపు మాటలు, చేసేవన్నీ తప్పుడు వాగ్దానాలని అన్నారు జగన్.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles