Actor nagarjuna went to meet modi at ahmedabad

Actor Nagarjuna went to meet Modi at Ahmedabad, Akkineni Nagarjuna, Bharatiya Janata Party, BJP Narendra Modi

Actor Nagarjuna went to meet Modi at Ahmedabad

మోదీని కలవటానికి వెళ్ళిన మరో సినీ హీరో నాగార్జున

Posted: 03/24/2014 09:54 AM IST
Actor nagarjuna went to meet modi at ahmedabad

భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీని పవన్ కళ్యాణ్ కలిసి రెండు రోజులే అయింది, ఆయనను కలవటానికి మరో సినీ హీరో సిద్ధమయ్యారు.

అక్కినేని నాగార్జున మోదీని కలవటానికి ఈ రోజు అహ్మదాబాద్ బయలుదేరి వెళ్ళారు.  ఆయన మోదీతో మధ్యాహ్నం భేటీ అవటానికి అవకాశం ఉంది.

పార్టీ సిద్ధాంతాలే కాకుండా నాయకుడికుండే ఆకర్షణ, అధికారంలోకి వస్తే పౌరులకు కలుగజేసే ప్రయోజనాల దృష్ట్యా చేసే వాగ్దానాలతో పాటు పార్టీలలో సినీ మెరుపులు కూడా అవసరమేనని రాజకీయ పార్టీలు భావిస్తున్న తరుణంలో అగ్రతారలే మద్దతునిస్తానంటే అంతకంటే కావలసిందేముంది.  

పవన్ కళ్యాణ్ పార్టీ ఆవిర్భావాన్ని ప్రకటించి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పనిచేస్తానని ప్రకటించిన తర్వాత మోదీని కలిసారు.  కానీ నాగార్జున ఏ హోదాలో భాజపాకి మద్దతునిస్తారన్నది భేటీ తర్వాతనే తెలుస్తుంది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles