Jc diwakara reddy and his son formally joined tdp on sunday

JC Diwakara Reddy and his son formally joined TDP on Sunday, Former Minister JC Diwakara Reddy, JC Pawan Kumar Reddy, Congress party, Telugu Desam party, Chandrababu Naidu

JC Diwakara Reddy and his son formally joined TDP on Sunday

లాంఛనంగా తెదేపాలో చేరిన జెసి, ఆయన కుమారుడు

Posted: 03/24/2014 10:30 AM IST
Jc diwakara reddy and his son formally joined tdp on sunday

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో మాజీ మంత్రి జెసి దివాకర రెడ్డి, ఆయన కుమారుడు పవన కుమార్ రెడ్డి, తెదేపాలో ఆదివారం నాడు లాంఛనప్రాయంగా చేరారు. 

జెసి దివాకర రెడ్డి తెదేపాలో చేరటం అనంతపూర్ కి చెందిన పార్టీలోని ఒక వర్గానికి సుతరామూ ఇష్టం లేదు.  వాళ్ళని చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఇంకా సముదాయించలేకపోయారు. 

ఈ సందర్భంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుని పోతుందని సులభంగా అర్థమౌతూనేవుందని, ఆ పార్టీలో అభ్యర్థులే లేకపోవటంతో పిలిచి మరీ టిక్కెట్లిస్తున్నారని చంద్రబాబు నాయుడు అన్నారు.  చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి పనులను ప్రశంసించినప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డి ఆ మాటలను జీర్ణం చేసుకోలేకపోవటాన్ని దివాకర రెడ్డి గుర్తుచేస్తూ, వైయస్ జగన్మోహన రెడ్డి చంద్రబాబుతో సరితూగలేరని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.  తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టటం తథ్యమని, పార్టీ తనకి ఏ బాధ్యతనిచ్చినా నెరవేర్చటానికి తాను సిద్ధమని కూడా జెసి అన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles