Priority to family members in trs defended by kcr

Priority to family members in TRS defended by KCR, Telangana Rashtra Samiti, K Chandrasekhara RAo, TRS Kavita, TRS leader KTR, TRS leader Harish RAo

Priority to family members in TRS defended by KCR

రాజకీయాల్లో కుటుంబ సభ్యుల ప్రమేయం సబబే

Posted: 03/24/2014 09:29 AM IST
Priority to family members in trs defended by kcr

తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు రాజకీయాల్లో కుటుంబ సభ్యుల ప్రమేయాన్ని సమర్థించారు.  కుటుంబ సభ్యులలో యోగ్యతలుండి, నాయకత్వ లక్షణాలుండి, సేవాదృక్పథముంటే వాళ్ళు రాజకీయాలలో ఎందుకు పనిచెయ్యగూడదని ప్రశ్నించారాయన.

ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో కుటుంబ సభ్యులకే ప్రాధాన్యతనిస్తున్నారన్న విమర్శకు జవాబుగా కెసిఆర్ మాట్లాడుతూ, తనే కాకుండా తన కొడుకు, కూతురు, మేనల్లుడు కూడా ఉద్యమాలలో పాల్గొని జైళ్ళకు పోవటం జరగలేదా అని ప్రశ్నించారు.  రైల్ రోకో కార్యక్రమంలో పాల్గొన్న కవితను అరెస్ట్ చేసి అర్థరాత్రి వదిలిపెట్టారని గుర్తుచేసారు కెసిఆర్.  

ఆమాటకొస్తే అంతకంటే ఎక్కువగానే ఉద్యమంలో పాల్గొని, దెబ్బలుతిని జైళ్ళలోకి వెళ్ళిన ఉద్యమకారులు ఎందరో ఉన్నారు.  ప్రశ్న కెసిఆర్ కుటుంబ సభ్యులు ఉద్యమంలో పాల్గొన్నారా లేదా అని కాదు.  కుటంబ సభ్యులకు ప్రాధాన్యతనివ్వటమన్నది సబబా అన్నది అసలు అడిగిన ప్రశ్న.

ఎన్నికలలో తెరాస రావటం తథ్యమన్న కెసిఆర్, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సాయం చేస్తానని మాటిచ్చారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles