Chandrababu boons to brahman community

Chandrababu boons to Brahman community, Telugu Desam Party, PV Narasimha Rao, Last rites of PV Narasimha Rao, Temple poojaris, Braham welfare fund

Chandrababu boons to Brahman community

బాసటగా ఉంటానని బ్రాహ్మణ సంఘాలకు బాబు హామీ

Posted: 03/24/2014 09:06 AM IST
Chandrababu boons to brahman community

ఆదివారం హైద్రాబాద్ లో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన నిర్వహించిన కార్యక్రమంలో హాజరైన తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పురోహితుల అర్థిక అభివృద్ధికి తనవంతు సాయం చేస్తానని హామీ ఇచ్చారు.  పూజారుల గౌరవ వేతనాన్ని పదివేల వరకు పెంచటం, వాళ్ళ నివాసానికి ఇళ్ళను కట్టించటం, నామినేటెడ్ పోస్ట్ ల భర్తీలో ప్రాధన్యత కల్పించటం చేస్తానని ఆయన మాటిచ్చారు.

ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు అదే కులానికి చెందిన దివంగత నేత పివి నరసింహారావు పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును గుర్తు చేసుకుని బాధపడ్డారు.  ప్రధానమంత్రిగా పనిచేసిన పివి మృతి చెందినప్పుడు ఆయనకు ఢిల్లీలో సముచిత స్థానాన్ని కల్పించలేకపోయారని, అంత్యక్రియలప్పుడు కూడా చాలా చిన్నచూపు చూసారని చంద్రబాబు వేదనను వ్యక్తపరచారు. 

అందువలన తెలంగాణాలో సామాజిక న్యాయం కేవలం తెలుగుదేశం పార్టీ తోనే సాధ్యమౌతుందని, అందుకు తెదేపాను గెలిపించటం చారిత్రక అవసరమని కూడా తెలియజేసిన చంద్రబాబు బ్రాహ్మణ సంక్షేమానికి విడిపోయిన ఇరు రాష్ట్రాలలోనూ రూ.500 కోట్ల చొప్పున నిధులను ఏర్పాటు చేస్తానని మాటిచ్చారు.

బ్రాహ్మణ సంఘాల నాయకులు చంద్రబాబు నాయుడికి ఆ కార్యక్రమంలో సన్మానం చేసారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles