False alarm about mh 370

Missing Malaysian plane MH 370, False alarm about MH 370, MH 370 with 239 aboard, Malaysian MH 370 Kuala Lumpur to Beijing, Satellite pictures at Australia, Family mebers of MH 370 passengers

False alarm about MH 370

ఎండమావిలా తయారైన మలేషియా విమానం ఆచూకీ

Posted: 03/21/2014 02:36 PM IST
False alarm about mh 370

మలేషియాకు చెందిన ఎమ్ హెచ్ 370 పౌర విమానం కౌలాలంపూర్ లో చైనా లోని బీజింగ్ లక్ష్యంగా బయలుదేరి రెండు వారాలు కావొస్తోంది కానీ లక్ష్యాన్ని చేరలేదు, ఆచూకీ తెలియలేదు.  ప్రయాణీకుల బంధువులు సమాచారాన్ని సరిగ్గా అందించటం లేదని వేదన చెందుతూ మలేషియా ప్రభుత్వాన్ని ఆరోపిస్తున్నారు.  బీజింగ్ లో లిడో హోటల్లో మలేషియన్ అధికారులతో జరిగిన భేటీలో ప్రయాణీకుల కుటుంబీకులకు ఎటువంటి స్వాంతనా లభించలేదు.  అధికారులు ఏదో దాస్తున్నారని అనుమానాలను వెలిబుచ్చుతున్నారు.  చైనా నేవల్ షిప్స్ కూడా గాలింపు చర్యలో అక్కడికి బయలుదేరుతున్నాయి. 

ప్రపంచ దేశాలన్నీ వెతుకుతున్న ఆ విమానం ఆచూకీ దొరికినట్లే దొరికి చేతికి చిక్కటం లేదు.  ఎన్ని రకాలుగా దర్యాప్తు చేసినా ఏ చిన్న క్లూని వదిలిపెట్టకుండా ప్రతి కోణంలోనూ గాలింపు చర్యలు చేపట్టినా చివరకు అవన్నీ ఫలితాన్నివ్వలేకపోయాయి. 

వియత్నాం దగ్గర సముద్రంలో విమాన శకలాలు ఉన్నాయన్న రిపోర్ట్ ఒట్టిదైంది.  సముద్రమంతా గాలించినా దొరక్క గాలించే ప్రదేశాన్ని విస్తృతం చేస్తూ వస్తున్నా లాభం లేకపోతోంది.  శాటిలైట్ చిత్రాలలో ఆస్ట్రేలియా దగ్గర హిందూమహా సముద్రంలో కొన్ని శకలాలు కనిపిస్తే రెండు రోజులుగా అక్కడ గాలించటం మొదలుపెట్టారు.  చివరకు అది కూడా ఎండమావిలా అక్కడేమీ లేకుండానే అనవసరమైన ప్రయాసను తెచ్చిపెడుతూ నీరసపరుస్తోంది.  అయినా మరోరోజు గాలింపు చర్యలను కొనసాగిస్తామంటున్నారు. 

239 మందితో అంతర్థానమైన విమానం కోసం ప్రస్తుతం ఐదు విమానాలు దక్షిణ హిందూ మహా సముద్రం ప్రాంతంలో వెతుకుతున్నాయి.  239 మందిలో 12 మంది విమాన సిబ్బంది కాగా 154 మంది చైనా దేశస్తులే.  మిగిలినవారిలో వివిధ దేశాలవారున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles