Tirumal hills fire extinguishing will take more time

Tirumal hills fire extinguishing will take long, Fire DG Sambasiva Rao, fire broke on Seshachalam hills, papanashanam way blocked, Tirumal foot way closed

Tirumal hills fire extinguishing will take more time says Fire DG

శేషాచలంలో మంటలు ఆర్పటం ఇప్పట్లో సాధ్యం కాదు!

Posted: 03/20/2014 09:07 AM IST
Tirumal hills fire extinguishing will take more time

శేషాచలం కొండల్లో మొత్తం 37 ప్రాంతంలో మంటలు చెలరేగుతున్నాయని, వాటిని అదుపు చెయ్యటం ఇప్పట్లో సాధ్యం కాని పని అని ఫైర్ డిజి సాంబశివరావు తెలియజేసారు.  మంటలు ఆర్పటంలో కలిగే కష్టనష్టాలే కాకుండా అందులో చిక్కుకునివున్న క్రూర మృగాల వలన కూడా సిబ్బందికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నందున అందుకు అవసరమైన మత్తు పదార్దాలను ఇతర భద్రతా సామగ్రిని కూడా తీసుకుని వెళ్ళవలసివుంటుంది.  మొత్తానికి పట్టణాలు, నగరాలలో మంటలు ఆర్పటానికి సుశిక్షితులైన ఫైర్ సిబ్బందికి అడవిలో మంటలు ఆర్పటం పెను సవాల్ ని విసురుతోంది.

శేషాచలం అడవులలో చెలరేగిపోతున్న కార్చిచ్చును అదుపులోకి తీసుకునిరావటానికి వెళ్ళిన సిబ్బంది దాని ప్రకోపానికి భయపడి వెనకడుగులు వడివడిగా వేసారు.  కేంద్రం పంపించిన సిబ్బంది వారితో పాటు అక్కడకు వెళ్ళిన తితిదే అధికారులు, మీడియా ప్రతినిధులను కూడా మంటలు చుట్టుముట్టటంతో భయభ్రాంతులయ్యారు.  అయితే ఒక పక్కనుంచి జాగ్రత్తగా మంటలను అదుపు చెయ్యటంతో వాళ్ళు బయటపడగలిగారు. 

అగ్ని కీలల వలన వ్యాపిస్తున్న మంటలే కాకుండా పెరిగిపోతున్న వేడి మంటలార్పాటానికి పూనుకున్న సిబ్బందికి హడలెత్తిస్తోంది.  రెండు రోజులుగా ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో చెలరేగుతున్న మంటలు ఆలయ చరిత్రలో మొదటిసారిగా అధికారులను, భక్తులను భయభ్రాంతులను చేస్తోంది. 

అమూల్యమైన వృక్షసంపదే కాకుండా, గాలి మరల ప్రాజెక్ట్ కి ఇప్పటి వరకు 90 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లుగా ప్రాధమిక అంచనాలో తేలింది. 

జరుగుతున్న ప్రకృతి భీభత్సం, తిరుమలకు పొంచివున్న ప్రమాదం మీద తితిదే అధికారులు ఇప్పిటికే గవర్నర్ నరసింహన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో సంప్రదింపులు జరిపామని అన్నారు. 

దావానలంతో తిరుమల భక్తులకు అడ్డంకులు

తిరుమల కొండలలో చెలరేగుతున్న మంటల వలన తిరుమల భక్తుల నడకదార్లు రెండిటినీ, పాపనాశనానికి వెళ్ళే దారి కూడా మూసివేయటం జరిగింది.  అయితే భక్తులు భీతిచెందవద్దని తితిదే ఈవో అంటున్నారు.  500 మంది నిరంతరం శ్రమిస్తున్నా మంటలు అదుపులోకి రావటం లేదు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles