Anil goswami looks in to division of police forces

Anil Goswami looks in to division of police forces, Police department division, State division by June 2, Division of assets and liabilities of Police dept

Anil Goswami looks in to division of police forces

ఉమ్మడి రాజధానిలో భద్రత, పోలీసు విభజన

Posted: 03/20/2014 07:36 AM IST
Anil goswami looks in to division of police forces

కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి రాష్ట్రంలో ఇరు ప్రాంతాలలోను భద్రతా సిబ్బంది విషయంలో బలగాలను విభజనను బుధవారం నాడు సమీక్షించారు.  ఉమ్మడి రాజధానిలో భద్రతకు అవసరమైన కేంద్ర బలగాలను 12 బెటాలియన్లలో పంపుతామని చెప్పారాయన.  పోలీసు శాఖలో విభజన తెలంగాణా అప్పాయింటెడ్ డే జూన్ 2 కల్లా పూర్తవుతుందని తెలియజేసారు. 

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పికె మొహంతి, ఉన్నతాధికారులు డిజిపి ప్రసాదరావు, ఇంటెలిజెన్స్ డిజి మహేందర రెడ్డి, రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి టిపి దాస్ తదితరులతో భేటీ అయిన గోస్వామి రాష్ట్ర విభజన దృష్ట్యా విభజించవలసిన పోలీసు శాఖలోని 13 విభాగాలలోనూ ఉచితరీతిని విభజన చెయ్యవలసివుందని అన్నారు. 

పోలీసు విభజనలో సిబ్బందితో పాటుగా ఆస్తులు, అప్పులు, శిక్షణా సంస్థలు మొదలైన వాటి విభజన ప్రక్రియ కేంద్ర కమిటీ పర్యవేక్షణలో జరుగుతుందన్నారు గోస్వామి.  కేంద్రబలగాలు, గ్రేహౌండ్స్, అక్టోపస్ లను ఇరు రాష్ట్రాలు కొంత కాలం ఉపయోగించుకునేవిధంగా వెసులుబాట్లుంటాయని కూడా గోస్వామి తెలియజేసారు.

ఇరు రాష్ట్రాలలోను పోలీసు శాఖల నిర్వహణకు నిధులు ఎంత అవసరం పడతాయి, ఎలా ఎలా అవసరం పడతాయన్న అంచనాలను తయారు చేయవలసిందిగా గోస్వామి ఆదేశించారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles