Eggs thrown on kiran and anupam kher

eggs thrown on Kiran and Anupam Kher, BJP aspirants at Chandigarh, Actor Anupam Kher, Actress Kiran Kher

eggs thrown on Kiran and Anupam Kher, BJP aspirants at Chandigarh

కిరణ్ అనుపమ్ ఖేర్ ల మీద గుడ్ల దాడి!

Posted: 03/18/2014 04:27 PM IST
Eggs thrown on kiran and anupam kher

భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి చండీగఢ్ కి వెళ్ళిన సినిమా నటులు, భార్యా భర్తలైన కిరణ్ ఖేర్, అనుపమ్ ఖేర్ల మీద కోడి గుడ్లు పడ్డాయి. 

అవి ఎవరో వైరి పక్షాల నుంచి వచ్చిపడ్డ గుడ్లనుకుంటే పచ్చి గుడ్ల మీద కాలు వేసినట్లే.  అవి భాజపా నాయకులు సంధించిన గుడ్లే.  పోలీసులు రంగంలోకి దిగి, దాడికి కారకులైన భాజపా కార్యకర్తలను అదుపులోకి తీసుకుని వాళ్ళ దగ్గర మిగిలిన కోడిగుడ్లను జప్తు చేసారు.  వాటిని ఎలాగూ మా మీద వెయ్యటానికి తెచ్చినవే కాబట్టి వాటిని మాకు స్వాధీనం చెయ్యండని అనుపమ్ ఖేర్ అన్నారు.  కాదు జప్తు చెయ్యబడ్డవి కాబట్టి అవి ప్రభుత్వ ఆస్తి అవుతాయని పోలీసులు వాటిని ఇవ్వటానికి నిరాకరించారు. 

కిరణ్ ఖేర్ నామినేషన్ మీద గుడ్లురిమిన చండీగఢ్ భాజపా అధ్యక్షుడు సంజయ్ టండన్, మాజీ ఎంపీ సత్యపాల్ జైన్, మాజీ కేంద్ర మంత్రి హర్మోహన్ ధవన్ ల పనే అలా గుడ్లు విసరటం.  వాళ్ళు చండీఘడ్ పార్టీ టికెట్ కోసం ఆశిస్తుంటే వాళ్ళందరినీ కాదని పార్టీ కిరణ్ ఖేర్ కి అవకాశమిచ్చింది.  అదీ వాళ్ళ కోపం.  దానికి వాళ్లు ఆమె చండీఘడ్ కి చెందినావిడ కాదన్న ఆరోపణను ముసుగు వేసారు.  గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించినట్లుంది కిరణ్ ఖేర్ రావటం అన్నారు వాళ్ళు.  ఇంతలో ఆ ముగ్గురి భార్యలు కూడా రంగ ప్రవేశం చేసారు.  ఇంట్లో కిచెన్ లో పెట్టిన గుడ్లను పరాయి ఆడవాళ్ళకి ఇస్తారా అంటూ తమ భర్తలతో తగువుకి వచ్చారు. 

అయితే కిరణ్ ఖేర్ వాళ్ళ దురభిప్రాయాన్ని పోగొడతానని, తాను చండీఘఢ్ కి చెందిన దాన్నేనని నచ్చజెప్తానని అన్నారు.  ఇది నేను పుట్టిన ప్రదేశం, ఇది నా మాతృభూమి కాదని ఎలా అంటారు అని అడిగారామె.  ఈ గుడ్ల ను ఏ దుకాణంలో కొన్నారో కూడా చెప్పగలను తెలుసా అన్నారు.  అనుపమ్ ఖేర్ కిరణ్ ఖేర్ గురించి మాట్లాడుతూ ఆమె పంజాబీ కుడి అని ఆమె పార్టీ కోసం చాలా సేవ చేసిందని, దేన్నైనా ధైర్యంగా ఎదుర్కుంటుందని, ఇలాంటి గుడ్లను పార్టీ తరఫున బయటి పార్టీ నాయకుల మీద ఎన్నో సార్లు వేసిందని అన్నారు.  అండే అండే పే లిక్ఖా హై ఖానే వాలే కా నామ్ (ప్రతి గుడ్డు మీదా దాన్ని తినేవాళ్ళ పేరు రాసిపెట్టివుంటుంది) అని కూడా అన్నారు అనుపమ్ ఖేర్. 

అంతేకాదు మామూలుగా అయితే కిరణ్ చాలా ఉగ్ర స్వభావం కలదని, బయటకు రాబట్టి ప్రశాంతంగా ఉండి తనను కూడా మాట్లాడనిస్తోందని అన్న అనుపమ్ ఖేర్, అదే ఇంట్లో ఉండేట్టుగా బయట కూడా ఉండివుంటే మీరు వేసిన గుడ్లన్నీ ఆమ్లెట్లైపోయి వుండేవి తెలుసా అన్నారు. 

పోలీసులు కలుగజేసుకోవటంతో గుడ్ల వాన ఆగిపోయింది.  కిందంతా చితచితలైనా పార్టీ తరఫున చెప్పదలచుకున్న నాలుగు ముక్కలనూ చెప్ప గలిగారు ఆ తర్వాత.  గుడ్లతో చేసిన ఇళ్ళల్లో ఉన్నవారు ఒకరి మీద మరొకరు రాళ్ళు విసురుకోగూడదన్న సత్యాన్ని వాళ్ళకి తెలియజేసారు.  

గాడిద గుడ్డేం కాదు అంటూ నిరసనకారులు అక్కడి నుండి వెళ్ళిపోయారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles