Chandrababu criticizes kcr

Chandrababu criticizes kcr, TRS Party, K Chandrasekhara Rao, Telugu Desam Party, YSRCP, Congress party, skull on bidi packs

Chandrababu criticizes kcr, TRS Party, K Chandrasekhara Rao, Telugu Desam Party

కెసిఆర్ మాయల మరాఠీ- చంద్రబాబు

Posted: 03/19/2014 07:46 AM IST
Chandrababu criticizes kcr

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మంగళ వారం నాడు తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు మీద విరుచుకుపడ్డారు.  ఆయన మాయల మరాఠీ అని, వసూల్ రాజా అని తూలనాడారు.  తెదేపా ప్రభంజనం చూసి ఆయన గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయని, నిద్రలోనూ ఆయనకి తెదేపాయే గుర్తకొస్తుందని అన్నారు. 

తెరాస, వైకాపా, కాంగ్రెస్ నేతలు తెదేపాలో చేరిన సందర్భంగా పై మాటలన్న చంద్రబాబు కెసిఆర్ గురించి మాట్లాడుతూ, సోనియా తల్లి వల్లనే తెలంగాణా వచ్చిందని కుటుంబ సభ్యులతో సహా ఆమెను కలిసివచ్చి హైద్రాబాద్ లో ఒంటెల మీద ఊరేగారు, ఇప్పుడేమో కాంగ్రెస్ మోసం చేసిందని చెప్తున్నారు అని ఎద్దేవా చేసారు.  ఆయన మాటల మరాఠీ, నీతి, నిజాయితీ, విశ్వసనీయత లేని వ్యక్తి అని అన్నారు. 

తెలంగాణాను, హైద్రాబాద్ ని అభివృద్ధి పరచి తానే కానీ కెసిఆర్ కానీ, కాంగ్రెస్ కానీ చెయ్యలేదని అన్నారు చంద్రబాబు.  తెదేపా నుంచి కూడా బయటకు వెళ్తున్న వారి విషయంలో వాళ్ళంతా నాయకులే కానీ పార్టీ కార్యకర్తలు కారని అన్నారాయన.  తెదేపా ఒక నాయకులను తయారు చేసే ఫాక్టరీ అని, ఎంతో మంది కాంగ్రెస్ నాయకులు తెదేపా నుంచి వెళ్ళినవారేనని, కెసిఆర్ కి కూడా తర్ఫీదు వచ్చింది తెదేపాలోనేనని చంద్రబాబు అన్నారు.  అందువలన ఒక నాయకుడు బయటకు పోతే మరో వంద మంది నాయకులను తయారుచేసుకునే సత్తా తెలుగుదేశం పార్టీకుందని ఆయన అన్నారు. 

కెసిఆర్ ఎకరాకు కోటి రూపాయల ఆదాయాన్ని గురించి మాట్లాడుతున్నారని, అదంతా అవినీతి పంటేనని కూడా చంద్రబాబు విమర్శించారు.  తెలంగాణాలో ఏ మారు మూల గ్రామానికి పోయి అక్కడ సిమెంట్ రోడ్డుని అడిగితే తన పేరే చెప్తుందని అంటూ, కార్మిక శాఖా మంత్రి గా ఉన్నప్పుడు బీడీ కట్టల మీద కెసిఆర్ పుర్రె గుర్తు పెట్టిన విషయం కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh