No polling on sriramanavami demands bjp

No polling on Sriramanavami demands BJP, BJP leader Baddam Balireddy, Bharatiya Janata Party, ZPTC MPTC polls, Polls on Ramanavami

No polling on Sriramanavami demands BJP

శ్రీరామనవమినాడు పోలింగ్ వద్దు- భాజపా పట్టు

Posted: 03/18/2014 03:17 PM IST
No polling on sriramanavami demands bjp

ఏప్రిల్ 8 న శ్రీరామ నవమి వేడుకను దేశవ్యాప్తంగా చేసుకుంటారు కాబట్టి ఆ రోజు పోలింగ్ నిర్వహించవద్దంటూ భాజపా నాయకుడు బద్దం బాల్ రెడ్డి ఎన్నికల కమిషన్ ని కోరారు. 

రాష్ట్రంలో ఏప్రిల్ 6, 8 తేదీల్లో జడ్పీటిసి, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చిన సందర్భంగా శ్రీరామనవమి నాడు పోలింగ్ నిర్వహించవద్దని, ఏప్రిల్ 8 కి ఒకరోజు ముందు కాని వెనుక కాని ఎన్నికలను నిర్వహించవలసిందిగా బద్దం బాల్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డికి వినతిపత్రాన్ని అందించారు. 

శ్రీరామనవమి నాడు కళ్యాణం సీతారాములకే కాదు లోక కళ్యాణంగా భావిస్తారు.  రాష్ట్రంలో మూల మూల ప్రాంతాల్లో కూడా రామనవమి వేడుకలను చేసుకుంటారు కాబట్టి ఆరోజు ఎన్నికలంటే దేని మీదా సరిగ్గా దృష్టి పెట్టటానికి అవకాశముండదు.  అందువలన రామనవమినాడు నిర్వహించదలచకున్న పోలింగ్ తేదీని మార్పు చెయ్యమని భాజపా కోరింది. 

ఈసారి లోక్ సభ శాసన సభ ఎన్నికల రూపకల్పనలో ఎన్నో విషయాలను పరిగణనలోకి తీసుకున్నామని ఎన్నికల కమిషన్ చెప్పింది.  పండుగలు, విశేష దినాలు, విద్యార్థుల పరీక్షలు ఇలా చాలా విషయాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికలను నిర్వహించబోతున్నామని చెప్పారు.  కానీ, పంచాయతీ కార్పొరేషన్ ఎన్నికలకు హడావిడిగా ప్రణాళిక వెయ్యటంతో శ్రీరామనవమి నాడు కూడా ఎన్నికలు పడ్డాయి.  అందువలన దాన్ని సరిచెయ్యమని భాజపా కోరుతోంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles