Mamata discards anna support

Mamata discards Anna Hazare support, Mamamta Banerjee, West Bengan Chief Minsiter Mamata Banerjeee, Social activist Anna Hazare

Mamata discards Anna Hazare support, Mamamta Banerjee

అన్నాతో విసిగిన దీదీ

Posted: 03/18/2014 01:16 PM IST
Mamata discards anna support

అన్నా హజారేతో సంబంధం లేకుండా వచ్చే ఎన్నికలలో పోటీచేస్తామంటూ తృణమూల్ కాంగ్రెస్ సోమవారం నాడు స్పష్టం చేసింది.  దానితో మార్చి 20 న అహ్మదాబాద్ లో మమతా అన్నాల బహిరంగ సభకు స్వస్తి చెప్పి మమత బెనర్జీ ఆ రోజు ముర్షిదాబాద్ లోని లాల్ బాగ్ లో పార్టీ సభ్యలతో సమావేశమవుతున్నారు.  ఈ విషయాన్ని తృణమూల్ అఖిలభారత సెక్రటరీ ముకుల్ రాయ్ ధృవీకరించారు.  అన్నాతో ఇక ముందు కూడా కలిసి చేసే కార్యక్రమమేమీ ఉండబోదని కూడా ఆయన స్పష్టం చేసారు. 

అన్నా హజరే అంతకు ముందు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని పొగుడుతూ తన సూచనలను పూర్తిగా అమలుపరచిన ముఖ్యమంత్రి ఆమేనని, అంతే కాకుండా నిరాడంబరమైన ముఖ్యమంత్రి కూడా ఆమేనంటూ చెప్తూ తన మద్దతు ఆమెకు ఉంటుందని అన్నారు.  కానీ ఢిల్లీ రామ్ లీలా మైదాన్ లో ఏర్పాటు చేసిన ర్యాలీకి ఆయన హాజరు కాలేదు.  పైగా, తాను మమతకు మద్దతిస్తానన్నాకాని మమత పార్టీకి కాదని అన్నారు అన్నా హజారే.  దానితో ఆమె ఆ రోజు ఒంటరిగానే బహిరంగ సభను నిర్వహించారు.  చివరకు అన్నా హజారే మద్దతు ఒద్దే వద్దని అనుకునే స్థితికి వచ్చేసారు. 

మమతా బెనర్జీ ఎన్నికల కోసం వేసుకున్న ప్రణాళికలో 78 సీట్లకు, యోగ్యులైన అభ్యర్థుల చేరికను బట్టి, పోటీ చేద్దామనుకుంటున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles