Dl ravindra reddy reddy to join tdp

DL Ravindra Reddy reddy to join TDP, Formaer Minsiter DL Ravindra Reddy, Former Minister K Partha Saradhi, DL REddy to join TDP, K Partha Saradhi ready to join YSRCP

DL Ravindra Reddy reddy to join TDP

డిఎల్ రవీంద్రారెడ్డి తెదేపాలో

Posted: 03/18/2014 12:36 PM IST
Dl ravindra reddy reddy to join tdp

మాజీ మంత్రి డా. డి ఎల్ రవీంద్రా రెడ్డి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా దువ్వూరులో మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జ్ సుధాకర్ యాదవ్ ని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కలిసారు. 

పురపాలక ఎన్నికలకు తెదేపా అభ్యర్థులను ఎంపిక చేసే పార్టీ కార్యక్రమంలో హాజరైన డిఎల్ త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని పార్టీలో చెప్తున్నారు. 

కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లోంచి పోయిన సంవత్సరం బయటకు వచ్చేసిన డిఎల్ వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్ ముఖ్యమంత్రి కాకూడదన్న దిశగా కృషిచేస్తున్నారు.  ఆ పని చంద్రబాబు నాయుడు సమర్ధవంతంగా చెయ్యగలరని నమ్ముతున్నట్టుగా డిఎల్ తెలియజేసారు. 

మరో మాజీ మంత్రి కె పార్థసారధి వైయస్ ఆర్ కాంగ్రెస్ లో చేరబోతున్నారు.  మొత్తానికి కాంగ్రెస్ ఇద్దరు సీనియర్లను పోగొట్టుకోగా వాళ్ళిద్దరినీ తెదేపా వైకాపాలు పంచుకున్నాయి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles