Prisoners to be sent to their respective states

Prisoners to be sent to their respective states, AP Prisoners to be divided, AGP Prisons and correctional services, 4900 Convicts in AP jails

Prisoners to be sent to their respective states, AP Prisoners to be divided

ఎక్కడి దొంగలు అక్కడనే... ఖైదీల విభజన

Posted: 03/15/2014 04:37 PM IST
Prisoners to be sent to their respective states

రాష్ట్ర విభజన నేపథ్యంలో వనరులు, ఉద్యోగులు, ఆస్తులు, అప్పులే కాకుండా ఖైదీల విభజన కూడా చోటు చేసుకుంటోంది.  రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆయా ఖైదీలు ఏ ప్రాంతానికి చెందినవారో తెలియజేయమంటూ ఆంధ్రప్రదేశ్ కారాగార శాఖ సర్క్యులర్ పంపించింది. 

అందిన సమాచారాన్నిబట్టి ఆయా ఖైదీలను తెలంగాణాలోకి పంపించాలా లేక ఆంధ్రప్రదేశ్ లోకా అన్నది నిర్ణయిస్తారు. 

దీనికి కారణం క్షమాభిక్షలాంటి నిర్ణయాలు ఒక రాష్ట్రం తీసుకున్నప్పుడు అది ఆ రాష్ట్రానికి చెందుతుంది కానీ ఆ రాష్ట్రంలోని జైళ్ళలో ఉన్న ఖైదీలు ఏ ప్రాంతానికి చెందినవారన్నదాన్నిబట్టి కాదు.  ఈ సంగతి వివరించిన కారాగారాలను సరిదిద్దటానికున్న శాఖ ఐజిపి బి సునీల్ కుమార్, ఉదాహరణకు తెలంగాణా ఒక ఆదేశాన్ని ప్రకటించిందనుకోండి, అది ఆ రాష్ట్రంలోని అన్ని జైళ్ళకు వర్తిస్తుంది కానీ అందులోని ఖైదీలు ఏ ప్రాంతానికి చెందినవారన్నదాన్నిబట్టికాదు అని అన్నారు. 

ఆంధ్రప్రదేశ్ లో 4900 మంది వివిధ కారాగారాలలో ఉన్నారు.  అయితే ప్రకాశం జిల్లా నుంచి ఐదుగురు ఖైదీలు వాళ్ళని చర్లపల్లి జైలుకి మార్చమని కోరారు కారణం- వాళ్ళ బంధువులు హైద్రాబాద్ లో ఉంటున్నారు కాబట్టి.  అలాగే వరంగల్ లో ఉన్న ఇద్దరు ఖైదీల కోరిక మీద వాళ్ళని అనంతపూర్  జైలుకి పంపించటం జరిగింది అని చెప్పారు సునీల్ కుమార్.  ఇలాంటి వాళ్ళు 50 మంది ఖైదీల వరకు ఉండవచ్చని అన్నారు ఐజిపి.

అయితే వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు పంపటమనేది కేవలం ఖైదీల విషయంలోనే జరుగుతుందని, విచారణలో ఉన్నవారి విషయంలో బదిలీలకు ఆయా కోర్టులే నిర్ణయాలు తీసుకుంటాయని కూడా ఐజిపి తెలియజేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles