Kcr assures taking good care of telangana people

KCR assures taking good care of Telangana people, Telangana Rashtra Samiti, K Chanadrasekhara Rao

KCR assures taking good care of Telangana people

మీ కాళ్ళకి ముల్లు నా పంటితో తీస్తా- కెసిఆర్

Posted: 03/17/2014 10:37 AM IST
Kcr assures taking good care of telangana people

ఆదివారం తెలంగాణా భవన్ లో కొత్తవాళ్ళని పార్టీకి చేర్చుకున్న సందర్భంగా మాట్లాడిన తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు కాంగ్రెస్ పార్టీని ఎండగట్టారు.

మనం చూడని  పార్టీలా, కడుపులో చల్ల కదలకుండా ఉన్నోళ్ళు ఉద్యమకారులు, రోడ్ల మీద తన్నులు తిన్నోళ్ళం పనికిరానోళ్ళమా, అధికారంలో ఉన్నప్పుడేం వెలగబెట్టింరు అంటూ కెసిఆర్ కాంగ్రెస్ తప్పిదాలను ఏకరువు పెట్టారు.  తెరాస కోరుకునేది తెలంగాణా ప్రజల ఆనందమైతే కాంగ్రెస్, తెదేపాలు కార్చేవి మొసలి కన్నీళ్ళన్నారాయన.  మేకవన్నె పులులైన ఆ పార్టీలను గెలిపిస్తే గోసపడతం కాబట్టి తెరాసను గెలిపించండి అన్నారు కెసిఆర్.

ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన తెరాస వలనే తెలంగాణా సాధ్యమైందని, అందువలన ఆ పార్టీని గెలిపించి రాష్ట్ర పునర్నిర్మాణంలో చేయూత నీయమని కెసిఆర్ పిలుపునిచ్చారు.  తన సేవా దృక్పథాన్ని చాటుతూ కెసిఆర్, మీ కాలికి ముల్లు గుచ్చితే నా పంటితో తీసేస్తా అన్న కేసిఆర్, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ, వాళ్ళని నమ్మితే పంటికి అందకుండా మింగేస్తరు, సిఎం పదవి కోసం నాకంటే నాకని కొట్లాడతరు అన్నారు కెసిఆర్.

పార్టీలో కొత్తగా చేరినవారు, కల్వకుర్తి ఎమ్మెల్యే తెదేపా నాయకుడు జైపాల్ యాదవ్, టిజిఓ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, తెలంగాణా ధూంధాం వ్యవస్థాపకుడు రసమయి బాలకిషన్. 

శ్రీనివాస గౌడ్ ని ఎంత సత్కరించినా తక్కువేనని, ఎందరు ఎన్ని రకాలుగా వేధించినా పెన్ డౌన్ దగ్గర్నుంచి సకలజనుల సమ్మె వరకు సింహంలా పోరాడారని, తనకు కుడిభుజంగా నిలిచారని పొగుడ్తూ, ఆయన ఎన్నికలలో నిలబడాలన్నది ప్రజలే డిమాండేనని, అందువలన తనే ఆయనను పార్టీలోకి రమ్మని ఆహ్వానించానని కెసిఆర్ అన్నారు.  అలాగే రసమయి బాలకిషన్ తన పాటలతో ఉద్యమకారులను ఉర్రూతలూగించారని, ఆయనను కూడా తాను రాజకీయాలలోకి రమ్మని ఆహ్వానించానని ఆయన అన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles